Gold – Silver Rates : నాన్‌స్టాప్ పుత్తడి పరుగులు..షాక్ ఇస్తున్న గోల్డ్, సిల్వర్ రేట్లు..

Gold - Silver Rates : మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో ప్రపంచ వ్యాప్త పరిణామాల వల్ల కూడా స్పాట్ గోల్డ్ ధర కాస్త వెనక్కి తగ్గింది.

Gold – Silver Rates

గోల్డ్ లవర్స్‌కు, మహిళలకు గోల్డ్ మార్కెట్ తీవ్ర నిరాశను మిగులుస్తోంది. కొంతకాలంగా రికార్డు స్థాయిల్లో పెరుగుతూ వస్తున్న పుత్తడి, వెండి ధరలు ఈరోజు, ఆగస్టు 27 గురువారం కూడా అదే జోరు కంటిన్యూ చేశాయి.

మొన్నటి వరకూ రూ .1.40 లక్షల వద్ద ఉండే తులం బంగారం ధర ..ఇప్పుడు చూస్తుండగానే రూ.1లక్ష63వేల740 మార్కును తాకిందంటేనే పసిడి పరుగు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలతో పాటు, యూఎస్ డాలర్ బలం పుంజుకోవడం, ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడానికి ప్రాఫిట్ బుకింగ్ వంటివి చేయడంతో ఈ పరిణామాలన్నీ గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1లక్ష63వేల740 వద్ద ఉండగా, ఆర్నమెంట్ గోల్డ్‌గా వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1లక్ష50వేల90గా ఉంది. ఇక సిల్వర్ విషయానికి వస్తే కిలో వెండి ధర రూ.2లక్షల59వేల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలోని మెయిన్ సిటీలైన హైదరాబాద్, విజయవాడతో పాటు ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1లక్ష63వేల740 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ రూ.1లక్ష50వేల90 వద్దే కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కాస్త ఎక్కువగా 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.1లక్ష63వేల890 గాను, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1లక్ష50వేల240 గాను నమోదైంది. కేవలం గోల్డ్ మాత్రమే కాకుండా సిల్వర్ కూడా గట్టి షాకే ఇవ్వడంతో కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2లక్షల64వేల900 వరకు పలకగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.2లక్షల59వేల900 వద్ద అందుబాటులో ఉంది.

Gold – Silver Rates

మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో ప్రపంచ వ్యాప్త పరిణామాల వల్ల స్పాట్ గోల్డ్ ధర కాస్త వెనక్కి తగ్గింది. అంతర్జాతీయంగా 1.4 శాతం వరకూ పడిపోయి ఔన్స్‌కు 4,592 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో ఇదే ధర 4,650 డాలర్ల కంటే పైకి చేరి, మే 14 తర్వాత అత్యధిక రేటును కూడా నమోదు చేసింది.

దాంతో లాభాలు పొందిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు తమ ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కి తీస్తుండటంతో గ్లోబల్ గోల్డ్‌పై ఒత్తిడి పెరిగింది. అమెరికా మార్కెట్లలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.9 శాతం తగ్గిపోయి 4,653 డాలర్ల వద్ద స్థిరపడగా, యుఎస్ డాలర్ ఇండెక్స్ 0.3 శాతం బలపడింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడల్లా అంతర్జాతీయంగా పసిడి కొనుగోలు వ్యయం కూడా పెరిగి డిమాండ్ తగ్గుతుంది. ఇదే ప్రస్తుతం మార్కెట్‌ను శాసిస్తోంది.

Cellulitis : కాళ్లపై ఎర్రటి వాపు, నెప్పి వేధిస్తోందా? సెల్యులైటిస్ ఏమో చెక్ చేసుకోండి..

Exit mobile version