Jantar Mantar
ఢిల్లీలోని ప్రసిద్ధ జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళనలు, ధర్నాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించింది.అక్కడ నిత్యం జరిగే ఆందోళనల వల్ల లోకల్‌గా ఉండే ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యావసరాలు , మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసుల రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతోందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను విచారణకు స్వీకరించింది.
ఈ పిటిషన్‌పై ఎంక్వైరీ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన సుప్రీంకోర్ట్.. కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత భాగస్వాములకు నోటీసులు జారీ చేసింది.
సతీష్ చంద్ కౌశిక్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై రియాక్ట్ అయిన సుప్రీంకోర్టు.. జంతర్ మంతర్(Jantar Mantar)కు ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో ఆందోళనలు, ధర్నాల కోసం ఏర్పాట్లు చేసే విషయంపై సలహాలు, సూచనలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ధర్నాల వల్ల వెహికల్స్ రాకపోకలకు, నిత్యావసరాలు , మెడికల్ సర్వీసెస్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు తీవ్ర ఆటంకం కలుగుతోందన్న అంశం అత్యంత ప్రాధాన్యమైనదని అభిప్రాయపడ్డారు.
అందువల్ల ఈ ప్రాంతం ఇకపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి సరైన స్థలం కాదన్న పిటిషనర్ వాదనను పరిగణనలోకి తీసుకుని, ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా విచారిస్తామని తెలిపారు.
ఇటీవల నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి నిరసనగా జంతర్ మంతర్ వద్ద నెలకు పైగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. కాక్‌రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సాగిన ఈ ఆందోళనల్లో పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్, సి.జె.పి వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు వేలాది మంది విద్యార్థులు అలాగే వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నిరసనలను అడ్డుకోవడానికి జరిగిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం వల్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం, ప్రభుత్వం డిమాండ్లకు అంగీకరించడంతో జులై 25న ఈ ఆందోళన విరమించారు.
తాజాగా ఈ సుదీర్ఘ ఆందోళనల వల్ల సూచిస్తూ పిటిషనర్ న్యాయవాది ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చిన ర్యాలీని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఇలాంటి ఘటనలపై స్పందించడానికి నిరాకరించిన అత్యున్నత ధర్మాసనం, శాంతిభద్రతలను ఎలా అదుపు చేయాలో అధికారులకు తెలుసని చెప్పింది. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే అప్పుడు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మొత్తం మీద ఢిల్లీకి గుండెకాయ వంటి జంతర్ మంతర్ వద్ద ధర్నాల నిర్వహణపై సుప్రీంకోర్టు.. వచ్చే విచారణలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
Indian Rupee : దూసుకెళ్లిన భారత రూపాయి..నెల రోజుల గరిష్ఠ స్థాయికి మన కరెన్సీ
