Just InternationalJust NationalLatest News

Indian Rupee : దూసుకెళ్లిన భారత రూపాయి..నెల రోజుల గరిష్ఠ స్థాయికి మన కరెన్సీ

Indian Rupee : ఈరోజు ట్రేడింగ్ సమయంలో వన్ రుపీ విలువ 0.3 శాతం బలపడి 95.13 వద్ద నిలిచింది. గత సెషన్‌లో ఇది 95.38 వద్ద ముగియగా, కేవలం ఒక్క వారంలోనే రూపాయి ఏకంగా 1 శాతానికి పైగా పుంజుకుంది.

Indian Rupee

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి(Indian Rupee మారకం విలువ ఓ రేంజ్‌లో పుంజుకుంది. సుమారు నెల రోజుల గరిష్ఠ స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఈరోజు ట్రేడింగ్ సమయంలో వన్ రుపీ విలువ 0.3 శాతం బలపడి 95.13 వద్ద నిలిచింది. గత సెషన్‌లో ఇది 95.38 వద్ద ముగియగా, కేవలం ఒక్క వారంలోనే రూపాయి ఏకంగా 1 శాతానికి పైగా పుంజుకోవడం విశేషమని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు తాజాగా ఇరాన్‌పై దాడులకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో.. ఈ రెండు దేశాల ఉద్రిక్తతలకు త్వరలోనే ఒక ముగింపు వస్తుందనే ఆశలు చిగురించడమే మార్కెట్‌లో ఈ మార్పునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇరాన్‌పై కొత్తగా దాడులు చేయడానికి డోనాల్డ్ ట్రంప్ విముఖత చూపడంతో క్రూడ్ ఆయల్ ధరలు ఏకంగా 7 శాతం వరకు పడిపోయాయి.

దీంతో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ కాస్ట్ 5 శాతం తగ్గి బ్యారెల్‌ 83.5 డాలర్లకు చేరింది. అలాగే యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ధర 7 శాతం క్షీణించి 79 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది.

అంతేకాకుండా భారతదేశంలోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రవాహం మళ్లీ పుంజుకోవడం రూపాయికి కొండంత బలాన్నిచ్చింది. జూలై నెలలో ఫారిన్ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో భారీగా కొనుగోళ్లను జరిపారు.

Indian Rupee
Indian Rupee

గత ఫిబ్రవరి తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు ఈ రేంజ్‌లో నికర కొనుగోలుదారులుగా మారడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దానికితోడు జూలై నెలలో మోదీ ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాల వలన భారత దేశంలోకి మొత్తం 41 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు తరలివచ్చాయి.

క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల భారత్‌కు ఇంపోర్ట్ బర్డెన్‌తో పాటు ద్రవ్యోల్బణ ప్రెషర్ కూడా తగ్గుతుందనే అంచనాలు బలపడ్డాయి. మరోవైపు రూపాయి విలువ 97 దాటి పడిపోకుండా ఉంచటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మకంగా డాలర్లను అమ్ముతూ గట్టి సపోర్టుగా నిలిచింది. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లోనే పయనించడం రూపాయికి మరింత ప్లస్‌గా మారింది.

Spider-Man : బాక్సాఫీస్ వద్ద స్పైడర్ మ్యాన్ రికార్డుల సునామీ.. ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవడానికి అదే కారణమా?

Related Articles

Back to top button