S.Janaki
భారత సంగీత సామ్రాజ్యంలో తీవ్ర విషాదం నెలకొంది. సుప్రసిద్ధ గాయని, గానకోకిల ఎస్ .జానకి(S.Janaki) ఇక లేరు. మైసూర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఇవాళ సాయంత్రం గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
1938 ఏప్రిల్ 23న గుంటూరులోని రేపల్లె తాలూకా పల్లెపట్లలో జానకి జన్మించారు. 60 ఏళ్ల కెరీర్‌లో 48 వేలకు పైగా పాటలు పాడిన జానకికి నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుంది. తన కెరీర్ మొత్తంలో ఆమె 32 అవార్డులు అందుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఎస్. జానకి కాంబినేషన్‌లో పలు భాషల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. జానకమ్మకు 4 నేషనల్ అవార్డులు, 33 ప్రసిద్ధ ఫిలిం అవార్డులు వచ్చాయి. కొద్దినెలల క్రితం అనారోగ్యంతో జానకమ్మ కుమారుడు మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో 50 వేలకు పైగా మధురమైన పాటలు పాడారు. ఏ భాషలో పాడినా, ఆ భాషలోని ఉచ్ఛారణ స్పష్టత ఆమె(S.Janaki) సొంతం. భావోద్వేగాలను పలికించడంలో దిట్టగా జానకికి పేరుంది. పాటల్లోని సందర్భానికి అనుగుణంగా ఆమె గొంతును మార్చగలరు. ఒక చిన్నారి గొంతు నుంచి, వృద్ధురాలి పాత్ర వరకు ఎవరికైనా తన గాత్రంతో ప్రాణం పోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
కొన్ని సినిమాల్లో మగవారి గొంతుతో కూడా పాడి సంగీత దర్శకులను సైతం ఆశ్చర్యపరిచారు. సప్తపది చిత్రంలోని గోవూలు తెల్లన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డు లభించింది. ఇళయరాజా స్వరకల్పనలో జానకమ్మ పాడిన వందలాది పాటలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. కేవలం సినిమా పాటలే కాకుండా, ఎన్నో భక్తి గీతాలు, లాలిపాటలు, జానపద గేయాలను పాడి శ్రోతల హృదయాలను గెలుచుకున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ఆమె తిరస్కరించారు. ఐదు దశాబ్దాల కెరీర్ దాటిన తర్వాత, చాలా ఆలస్యంగా ఈ గుర్తింపు ఇవ్వడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు.
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ప్రయోగం ఫ్లాప్.. మ్యూజ్ ఇమేజ్ టూల్ క్లోజ్
