Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ప్రయోగం ఫ్లాప్.. మ్యూజ్ ఇమేజ్ టూల్‌ క్లోజ్

Instagram : ఈ ఫీచర్‌ను మెటా కంపెనీ ఇన్‌స్టా యూజర్ల నుంచి ఎలాంటి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండానే డీఫాల్ట్‌గా అందరికీ ఎనేబుల్ చేసేసింది.

Instagram

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు తన ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల నుంచి గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌పై రీసెంట్‌గా లాంచ్ చేసిన ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను, ప్రారంభించిన కొద్ది రోజులకే ఆ టూల్‌ను క్లోజ్ చేయాల్సి వచ్చింది.

యూజర్ల పర్సనల్ ప్రైవసీ, వారి కంటెంట్ సేఫ్టీపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో మెటా ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ గ్లోబల్ టెక్ మ్యాగజైన్ టెక్‌క్రంచ్ తన రిపోర్ట్‌లో మొదటిసారిగా బయటపెట్టింది.

అసలు వివాదానికి కారణమైన ఆ ఫీచర్ పేరు..మ్యూజ్ ఇమేజ్. ఈ టూల్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఉండే పబ్లిక్ అకౌంట్ల ఫోటోలను యూజ్ చేసి వేరే యూజర్లు ఎవరైనా సరే.. కొత్త ఏఐ ఇమేజులను క్రియేట్ చేయొచ్చు. అంటే మనం ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చే బాక్స్‌లో ఏదైనా ఒక పబ్లిక్ అకౌంట్ యూజర్ నేమ్‌ను మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆ అకౌంట్‌లో ఉన్న ఫోటోల పోలికల ఆధారంగా సరికొత్త ఏఐ ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి.

అయితే, ఈ ఫీచర్‌ను మెటా కంపెనీ ఇన్‌స్టా(Instagram) యూజర్ల నుంచి ఎలాంటి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండానే డీఫాల్ట్‌గా అందరికీ ఎనేబుల్ చేసేసింది. ఒకవేళ తమ పబ్లిక్ ఫోటోలను ఏఐ ట్రైనింగ్ లేదా క్రియేషన్ కోసం వాడకూడదని అనుకునే వాళ్లు, స్వయంగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి మాన్యువల్‌గా ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ వినియోగదారుల హక్కులను దెబ్బతీసేలా ఉందంటూ.. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.

సొంత ఫోటోలతో ఇతరులు ఏఐ చిత్రాలు క్రియేట్ చేయడంపై విమర్శలు వెల్లువలా మారడంతో మెటా మేనేజ్మెంట్ వెంటనే అలర్ట్ అయింది. యూజర్లకు వారి పబ్లిక్ కంటెంట్‌పై పూర్తి కంట్రోల్ ఇస్తూనే, ఒక సరికొత్త క్రియేటివ్ టూల్‌ను ఇంట్రడ్యూస్ చేయాలనేది తమ ప్రధాన ఉద్దేశమని కంపెనీ వివరణ ఇచ్చింది.

అయితే ఈ ఎక్స్‌పెరిమెంట్ చేయడంలో తాము ఫెయిల్ అయ్యామని మెటా ఓపెన్‌గా అంగీకరించింది. అందుకే యూజర్ల ఫీడ్‌బ్యాక్‌ను గౌరవిస్తూ ఈ మ్యూజ్ ఇమేజ్ ఫీచర్‌ను..ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్(Instagram) నుంచి పూర్తిగా తీసేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది.

ఈ ఏఐ ఫీచర్‌పై కేవలం నార్మల్ యూజర్లే కాకుండా ప్రైవసీ హక్కుల కార్యకర్తలు, సెలబ్రిటీలు, మీడియా నిపుణుల సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా హాలీవుడ్ నటుల ప్రసిద్ధ యూనియన్ ‘శాగ్-ఆఫ్ట్రా’ (SAG-AFTRA) ఈ విషయంలో మెటాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

Instagram

ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటోలను లేదా వివరాలను ఏఐ కోసం యూజ్ చేసే ముందు వారి నుంచి కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని, లేకపోతే సెలబ్రిటీలు, సాధారణ ప్రజల అనుమతి లేకుండానే వారి డిజిటల్ క్లోన్స్ క్రియేట్ చేసి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

మొత్తంగా యూజర్ల డేటా వినియోగంపై వినియోగదారులకే పూర్తి పవర్స్ ఇవ్వాలనే డిమాండ్ మరింత స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్‌తో రాబోయే రోజుల్లో ఏఐ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తెచ్చే ముందుగానే టెక్ కంపెనీలు పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి.

Vietnam : వియాత్నంలో ఘోర ప్రమాదం .. మృతుల్లో తెలుగు టూరిస్టులు

Exit mobile version