October 2026 Festivals
భారతీయ సంస్కృతిలో శరదృతువు తీసుకుని వచ్చే పండుగల వైభవమే వేరు అంటారు పెద్దలు. ముఖ్యంగా అక్టోబర్ నెలంతా ఆధ్యాత్మిక శోభతో, పవిత్ర వ్రతాలతో, మహోత్సవాలతో, వరుస పండుగలతో కన్నుల పండువలా నిలవబోతోంది.
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వచ్చే బహుళ పంచమి గురువారం రోజు ప్రారంభమైన ఈ అక్టోబర్ నెల భాద్రపద మాసం.. ఆశ్వీయుజ మాసం బహుళ అమావాస్య శనివారంతో ముగుస్తుంది. అంటే అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు భాద్రపద మాసం నడుస్తుండగా, 11 నుంచి 31వ తేదీ వరకు పవిత్రమైన ఆశ్వీయుజ మాసం కొనసాగుతుంది. రోజూ ఏదో ఒక స్పెషాలిటీతో నిండిన ఈ మంత్‌లోని ముఖ్యమైన డేట్‌లు, పండుగల వివరాలను ఇప్పుడు చూద్దాం.
నెల ప్రారంభంలోనే అక్టోబర్(October 2026 Festivals) 2 శుక్రవారం రోజు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, మహాత్మా గాంధీ జయంతితో పాటు పవిత్రమైన మహాలక్ష్మి వ్రతము, రుద్రాష్టమి పర్వదినాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 6 మంగళవారం రోజు విశిష్టమైన ఇందిరా ఏకాదశిగా నిలుస్తుంది.
ఇక అక్టోబర్ 8 గురువారం రోజు మాస శివరాత్రి, ప్రదోష వ్రతం ఒకే రోజు కలసిరావడం విశేషం. అక్టోబర్ 10 శనివారం రోజు ఎంతో ప్రాధాన్యత ఉన్న మహాలయ అమావాస్య వస్తుంది.. దీంతో పితృ పక్షాలు ముగుస్తాయి. ఇక తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ నవరాత్రులు కూడా ఈరోజు నుంచే మొదలవుతాయి.
ఆ మరుసటి రోజు అక్టోబర్ 11న ఆదివారం చంద్రోదయంతో పాటు మహిమాన్వితమైన శరన్నవరాత్రులు ( దేవీ నవరాత్రులు) ప్రారంభమవుతాయి. అలాగే అక్టోబర్ 12 సోమవారం నుంచి కలియుగ దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమవుతాయి. ఈరోజే సోమవార వ్రతం కూడా ఉంది.
అక్టోబర్ 14 బుధవారం చతుర్దశి వ్రతం, 15 గురువారం లలితా పంచమి, 16 శుక్రవారం రోజు స్కంద షష్టి, సరస్వతి పూజలను నిర్వహిస్తారు. ఈ రోజు మూల నక్షత్రంతో సరస్వతి దేవి అలంకారం వస్తుంది కాబట్టి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి, చదువుల తల్లి సరస్వతిమాత ఆరాధనకు ఇది అత్యంత శ్రేష్ఠమైన రోజుగా భావిస్తారు. అదే రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజకు కూడా ఎంతో అనుకూలంగా పెద్దలు చెబుతారు.
ఆ తర్వాత అక్టోబర్ 17 శనివారం దుర్గా పూజ, సరస్వతి పూజలతో పాటు తులా సంక్రాంతి వస్తుంది. అక్టోబర్ 18 ఆదివారం రోజు తులా కావేరి స్నానంతో పాటు రంగురంగుల పూల సంబురం సద్దుల బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకొంటారు.
అక్టోబర్ 19 సోమవారం రోజు దుర్గాష్టమి, మహర్నవమి వేడుకలు జరుగుతాయి. ఇక అక్టోబర్ 20 మంగళవారం రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి లేదా దసరా పండుగ వస్తుంది. ఈ రోజు శమీ పూజ (జమ్మి పూజ) చేయడం సాంప్రదాయంగా వస్తుంది.
విజయదశమి ముగిసిన తర్వాత కూడా పండుగల పరంపర కొనసాగుతుంది. అక్టోబర్ 22 గురువారం పాపాంకుశ ఏకాదశి, 23 శుక్రవారం ప్రదోష వ్రతం, 24 స్వాతి కార్తి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 26 సోమవారం రోజు పౌర్ణమి రానుంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా చెబుతారు. ఇదే రోజు శ్రీ వాల్మీకి జయంతి కూడా ఉంది.
ఆ తర్వాత అక్టోబర్ 28 బుధవారం మహిళలు ఎంతో వేడుకగా జరుపుకునే అట్లతద్ది పండుగ వస్తుంది. చివరిగా అక్టోబర్ 29 గురువారం రోజు సంకటహర చతుర్దశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా అక్టోబర్ నెలంతా(October 2026 Festivals) ప్రతీ కుటుంబంలో భక్తి పారవశ్యాన్ని, ఆనందాలను నింపే ఆధ్యాత్మిక పండగల జాతరతో కళకళలాడనుంది.
Emotional Immaturity : ఎమోషనల్ ఇన్ మెచ్యూరిటీకి చెక్ పెట్టే 4 గోల్డెన్ రూల్స్
