Delhi Capitals : కిల్లర్ మిల్లర్..పంజాబ్ కు ఢిల్లీ షాక్

Delhi Capitals : ఐపీఎల్ క్రికెట్ సమరంలో మరో ఉత్కంఠభరిత పోరు ముగిసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది

Delhi Capitals

ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) షాకిచ్చింది. గెలిచే మ్యాచ్ లో చెత్త బౌలింగ్ తో పరాజయం పాలైంది. దాదాపుగా ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ఢిల్లీ అనూహ్యంగా గెలిచింది. అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో మిల్లర్ విధ్వంసకర బ్యాటింగ్, అశుతోష్ శర్మ మెరుపులు విజయాన్ని అందించాయి. పంజాబ్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి.

అటు ఢిల్లీ(Delhi Capitals)కి ఇది ఐదో విజయం. ఈ మ్యాచ్ లో ఐదు మార్పులు చేసిన ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య మరోసారి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు కేవలం 6.5 ఓవర్లలోనే 78 పరుగులు జోడించారు. ప్రియాన్ష్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు.

ప్రభ్ సిమ్రన్ (18) ఔటైనా ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించాడు. 33 బంతుల్లోనే 56 పరుగులు చేయగా అతని ఇన్నింగ్స్ 6 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ , కూపర్ కన్నోలీ దుమ్మురేపారు. మూడో వికెట్ కు 52 బంతుల్లో 83 పరుగులు చేశారు. వీరిద్దరినీ కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్లు విఫలమయ్యారు.

ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు దూకుడుగా ఆడిన కూపర్ కన్నోలీ 27 బంతుల్లో 38 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా… స్టోయినిస్ (1), శశాంక్ సింగ్ (0) వెంటవెంటనే ఔటవడం పంజాబ్ జోరుకు బ్రేక్ పడింది. శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 59 (5 ఫోర్లు, 3 సిక్సర్లు) నాటౌట్, సూర్యాన్ష్ కేవలం 8 బంతుల్లోనే 21 (2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 2 , తివారీ 2 , అకీబ్ నబిదార్ 2 వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఆరంభంలోనే తడబడింది. కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెఎల్ రాహుల్ (9), అభిషేక్ పోరెల్ (5), సాహిల్ (13) రన్స్ కు వెనుదిరిగారు. ఈ దశలో స్టబ్స్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 41 పరుగులు జోడించారు. స్టబ్స్ (12) రన్స్ కు ఔటైనా అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ కొనసాగించారు.

Delhi Capitals

దూకుడుగా ఆడిన వీరి జోడీ 34 బంతుల్లోనే 64 పరుగులు జోడించింది. అక్షర్ పటేల్ 30 బంతుల్లో 56 (8 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ కు ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే క్రీజులో ఉన్న మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రెచ్చిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 51 (3 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు.

మిల్లర్ ఔటైన తర్వాత ఢిల్లీ గెలవడం కష్టంగానే కనిపించింది. అయితే అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ కలిసి 14 బంతుల్లోనే 35 రన్స్ చేశారు. దీంతో అస్సలు గెలుపుపై ఆశలు లేని పంజాబ్ కింగ్స్ మరో ఓవర్ మిగిలుండగానే 211 పరుగుల టార్గెట్ ను అందుకుంది. పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ఫీల్డింగ్ తో పాటు చెత్త బౌలింగ్ తో మూల్యం చెల్లించుకుంది.

Draupadi:విదేశాల్లోనూ ద్రౌపదిని ఆరాధిస్తారని తెలుసా? ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఇవే..

Exit mobile version