Devdutt Padikkal : సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్..లంకతో సమంగా తొలి రోజు పోరు..

Devdutt Padikkal : ఒకవైపు యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో సెంచరీతో స్టేడియంని హోరెత్తించగా, మరోవైపు శ్రీలంక బౌలర్లు కొత్త బంతితో దెబ్బకొట్టి మ్యాచ్‌ని మళ్లీ బ్యాలెన్స్ చేశారు.

Devdutt Padikkal

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆదివారం స్టార్ట్ అయిన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజే మైండ్ బ్లాకింగ్ డ్రామాకు వేదికగా మారింది. ఒకవైపు యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో సెంచరీతో స్టేడియంని హోరెత్తించగా, మరోవైపు శ్రీలంక బౌలర్లు కొత్త బంతితో దెబ్బకొట్టి మ్యాచ్‌ని మళ్లీ బ్యాలెన్స్ చేశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అయితే ఇన్నింగ్స్ ఒక దశలో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న టైమ్‌లో లంక బౌలర్లు మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోవడంతో.. ఫస్ట్ డే పైచేయి ఏ జట్టుదో తేలకుండా సరిసమానంగా ముగిసింది.

టాస్ గెలిచి ముందస్తుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. తొలి వికెట్లకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 45 రన్స్, కేఎల్ రాహుల్ 18 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. ఈ టైమ్‌లో క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ 50 రన్స్‌తో అర్ధశతకంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

ఇక దేవదత్ పడిక్కల్ అయితే కట్ షాట్లతో లంక బౌలర్లపై విపరీతమైన ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఎక్కడా తొణక్కుండా ఆడుతూ 117 రన్స్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో వరుసగా రెండో టెస్ట్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆఖరి సెషన్‌లో రవీంద్ర జడేజాతో కలిసి పడిక్కల్ 74 పరుగుల విలువైన పార్టనర్‌షిప్ నమోదు చేసి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. సెంచరీ మార్కు దాటాక పడిక్కల్ ( Devdutt Padikkal) మరింత దాటిగా పరుగులు సాధించాడు.

అయితే ఇన్నింగ్స్ ఊపందుకుంటున్న టైమ్‌లో భారత శిబిరానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లంక బౌలర్ లహిరు కుమార విసిరిన పదునైన బౌన్సర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎడమ చేతి మణికట్టుకు చాలా బలంగా తాకింది. ఆ నొప్పితో తట్టుకోలేక పంత్ రిటైర్డ్ హర్ట్‌గా క్రీజు వదిలి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా 43 రన్స్‌తో వేగంగా ఆడటానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికే సెంచరీ కొట్టి లంకకు చుక్కలు చూపిస్తున్న పడిక్కల్‌ను.. స్పిన్నర్ కేశర నువంత పెవిలియన్ పంపాడు.

ఇక రెండో కొత్త బాల్ చేతికి రాగానే లంక బౌలర్లు మ్యాచ్ రూపురేఖలనే మార్చేశారు. లంక బౌలర్ ఆసిత ఫెర్నాండో అద్భుతమైన ఇన్‌స్వింగర్ బాల్‌తో దూకుడుగా ఉన్న జడేజాను క్లీన్ బౌల్డ్ చేసి భారత్ ఇన్నింగ్స్‌కు కళ్లెం వేశాడు.

Devdutt Padikkal

ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురెల్ 7 రన్స్, అరంగేట్ర ఆటగాడు సారాంశ్ జైన్ 4 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో ఆసిత ఫెర్నాండో 3 వికెట్లతో చెలరేగగా, లహిరు కుమార ఒక వికెట్ సాధించాడు.

మొత్తంగా చూస్తే 85 ఓవర్లలో భారత్ 300/5 వద్ద ఆగింది. దేవదత్ పడిక్కల్( Devdutt Padikkal) 117, శుభ్‌మన్ గిల్ 50 రన్స్‌తో మెరవగా, ఆసిత ఫెర్నాండో 46 పరుగులిచ్చి 3 వికెట్లు, లహిరు కుమార 38 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు. ఫస్ట్ డే షో రెండు జట్లకు సమానంగా నిలవడంతో మర్నాటి రోజు గేమ్‌పై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

Rain Alert : బంగాళాఖాతంలో అలజడి..రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు

Exit mobile version