Just Andhra PradeshJust TelanganaLatest News

Rain Alert : బంగాళాఖాతంలో అలజడి..రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు

Rain Alert : రుతుపవనాలు కూడా చాలా వేగంగా ముందుకు కదలడంతో రాబోయే కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జోరుగా వానలు పడనున్నాయి.

Rain Alert

తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయిన జనాలకు ఉపశమనం కలిగిస్తూ వర్షాలు మళ్లీ మొదలవుతున్నాయి.

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడడం.. దీనికి తోడు ఆకాశంలో మేఘాలు ఎక్కువగా గుమిగూడటం, రుతుపవనాలు కూడా చాలా వేగంగా ముందుకు కదలడంతో రాబోయే కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జోరుగా వానలు పడనున్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలకు వానల ముప్పు ఎక్కువగా ఉంది. ఈరోజు, రేపు గట్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వానలతో పాటు తీరప్రాంతాల్లో ఈదురు గాలులు భయపెట్టేలా వీయబోతున్నట్లు వివరించింది.

పశ్చిమ బెంగాల్, ఒడిషాతో పాటు మన ఉత్తరాంధ్ర తీరం పొడవునా గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విరుచుకుపడతాయి. సముద్రంలో కెరటాలు ఎగసిపడి తీవ్రంగా అలజడి చెలరేగే ప్రమాదం ఉండటంతో జాలర్లు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు గట్టిగా హెచ్చరించారు. ఆదివారం ఉదయం నాటికే ఈ అల్పపీడనం సముద్రంలో కదలకుండా అలాగే ఉంది.

ఇటు తెలంగాణలో కూడా వర్షాల జోరు తగ్గట్లేదు. ఇక్కడ రుతుపవనాలు చాలా వేగంగా విస్తరిస్తుండటంతో ఆగస్టు 25 మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Rain Alert
Rain Alert

ఉరుములు, మెరుపులు, పిడుగుల భయం కూడా ఉండటంతో తెలంగాణ రాష్ట్రానికి ముందస్తుగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌తో కూడా ఆగస్టు 25 వరకు నగరంలో మోస్తరు వానలు లేదా ఉన్నట్లుండి కుండపోత జల్లులు పడొచ్చు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం, శనివారం హైదరాబాద్‌ షేక్‌పేటలోనే అత్యధిక వర్షపాతం రికార్డైంది. నిన్న కుమురం భీం జిల్లాలో ఏకంగా 66 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదయింది. రాబోయే మూడు రోజులు ఈ వానల తీవ్రత ఇలాగే ఉండేలా ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేవాళ్లు దీని ప్రకారం ప్లాన్ చేసుకోవడం మంచిది.

Express Way : ఖరగ్‌పూర్ టు అమరావతి వయా మన్యం ..రూ.32 వేల కోట్లతో సూపర్ స్పీడ్ ఎక్స్‌ప్రెస్ వే..

Related Articles

Back to top button