IPL Final : అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్..బెంగళూరుకు బీసీసీఐ షాక్

IPL Final : ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. 19వ సీజన్ ఫైనల్ కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది

IPL Final

ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. 19వ సీజన్ ఫైనల్ కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. నిజానికి గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన జట్టు హోంగ్రౌండ్ లో ఫైనల్(IPL Final) జరగడం ఆనవాయితీ. కానీ బీసీసీఐ ఈసారి బెంగళూరుకు షాకిచ్చింది.

తమ నిర్దేశిత నిబంధనలకు లోబడి స్థానిక అసోసియేషన్ ఏర్పాట్లు లేకపోవడంతో వేదికను మార్చినట్టు బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. అయితే టికెట్ల వివాదమే అసలు కారణంగా చెబుతున్నారు.స్థానిక అసోసియేషన్లు, అధికారుల నుంచి టికెట్ల కోసం డిమాండ్లు విపరీతంగా ఉండడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎమ్మెల్యేలు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి వీవీఐపీ కాంప్లిమెంటరీ పాసుల కోసం అసోసియేషన్ తో పాటు ఫ్రాంచైజీని విపరీతంగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

దీంతో ఫైనల్ మ్యాచ్ ను అక్కడ నిర్వహిస్తే లేనిపోని తలనొప్పులు ఎదురయ్యే అవకాశముందని భావించే వేదికను మార్చినట్టు అర్థమవుతోంది. ఒకవిధంగా అహ్మదాబాద్ కెపాసిటీ కూడా చిన్నస్వామి కంటే మూడు రెట్లు ఎక్కువ. దీంతో బీసీసీఐ మరో ఆలోచన లేకుండా ఫైనల్ మ్యాచ్ ను నరేంద్రమోదీ స్టేడియానికి తరలించింది.

అలాగే ప్లే ఆఫ్స్ లో ఎలిమినేటర్ , క్వాలిఫైయర్ వేదికలను కూడా బీసీసీఐ ప్రకటించింది. లీగ్ స్టేజ్ మ్యాచ్ లు మే 24న ముగియనుండగా.. మే 26న క్వాలిఫైయర్-1 జరగనుంది. ఈ మ్యాచ్ కు ధ‌ర్మ‌శాల‌లోని హెచ్‌పిసిఎ స్టేడియం ఆతిధ్యం ఇవ్వ‌నుంది.

పాయింట్ల ప‌ట్టిక‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు దీనిలో తలపడతాయి. దీనిలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ కు న్యూ చండీగఢ్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టుతో క్వాలిఫ‌య‌ర్-2 ఆడుతుంది.

IPL Final

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ షెడ్యూల్

మే 26 ః క్వాలిఫైయర్ 1 – ధర్మశాల

మే 27 ః ఎలిమినేటర్ – న్యూ చండీగఢ్

మే 29 ః క్వాలిఫ‌య‌ర్ 2 – న్యూ చండీగఢ్

మే 31 ః ఫైన‌ల్ – అహ్మదాబాద్

Vijay : మ్యాజిక్ ఫిగర్ వచ్చాక రండి..విజయ్ కు గవర్నర్ షాక్

Exit mobile version