KKR vs PBKS : ఈడెన్ లో వరుణిడి ఆట…కోల్ కతా,పంజాబ్ మ్యాచ్ రద్దు

KKR vs PBKS : ఐపీఎల్ 19వ సీజన్ కు వర్షం దెబ్బ మొదలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది

ఐపీఎల్ 19వ సీజన్ కు వర్షం దెబ్బ మొదలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్(KKR vs PBKS) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ముందు నుంచీ అనుకుంటున్నట్టుగానే ఈ మ్యాచ్ ను వరుణుడు తుడిచిపెట్టేశాడు. మ్యాచ్ ఆరంభ సమయానికి వాతావరణం మేఘావృతమై ఉండగా టాస్ వేసారు.

టాస్ గెలిచిన కోల్ కతా(KKR vs PBKS) బ్యాటింగ్ కూడా మొదలుపెట్టింది. పిచ్ కండీషన్స్ సహకరించడంతో పంజాబ్ బౌలర్ బార్ట్ లెట్ చెలరేగిపోయాడు. ఫలితంగా కోల్ కతా ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4) పరుగులకే వెనుదిరిగారు. గ్రీన్ విఫలమవడం ఇది వరుసగా మూడోసారి.

అయితే రహానే, రఘువంశీ ఇన్నింగ్స్ కొనసాగిస్తుండగా 3.4 ఓవర్లలో 25 పరుగుల దగ్గర వర్షం మొదలైంది. క్రమంగా పెరిగిపోవడంతో గ్రౌండ్ మొత్తం కవర్లు కప్పారు. ఎంతసేపటికీ తగ్గని వర్షం రెండు గంటల పాటు ప్రతాపం చూపించింది. రాత్రి పదిన్నర తర్వాత వర్షం తగ్గముఖం పట్టింది. అయితే మైదనాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చారు.

KKR vs PBKS

ఇదే విషయాన్ని ఇరు జట్ల కెప్టెన్లకు చెప్పి మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. ఈ సీజన్ లో మ్యాచ్ వర్షంతో రద్దవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్ లలో 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆర్సీబీ, రాజస్థాన్, ఢిల్లీ, సన్ రైజర్స్ టాప్ 5లో కొనసాగుతున్నాయి. కాగా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్ వర్షం పుణ్యమానీ పాయింట్ల ఖాతా తెరిచింది. ప్రస్తుతం కేకేఆర్ ఎనిమిదో స్థానంలో ఉండగా, గుజరాత్ 9వ ప్లేస్ లోనూ, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానంలోనూ కొనసాగుతున్నాయి.

Chennai Super Kings : ధోనీ లేకుంటే అంతేనా ?…పాయింట్ల పట్టికలో అట్టడుగున చెన్నై

Exit mobile version