Mirabai Chanu : మీరాబాయి చాను గోల్డెన్ హ్యాట్రిక్.. మూడో స్వర్ణంతో సరికొత్త చరిత్ర

Mirabai Chanu : పతకం అందుకున్నప్పుడు మీరాబాయి చాను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. పోడియం దగ్గర జాతీయ గీతం వినిపిస్తున్నంత సేపూ కన్నీటి పర్యంతమైంది.

Mirabai Chanu

కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను చారిత్రక ప్రదర్శనతో బంగారు పతకాన్ని అందించింది. కామన్ వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డుతో ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన మీరాబాయి చాను(Mirabai Chanu) అంచనాలకు తగ్గట్టే రాణించింది.

స్నాచ్ తొలి ప్రయత్నంలో మీరాబాయి చాను విఫలమైంది. అయితే రెండో ప్రయత్నంలో 82 కేజీలు, మూడో ప్రయత్నంలో 85 కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. తర్వాత క్లీన్ అండ్ జర్క్ మొదటి ప్రయత్నంలో విఫలమైంది. తర్వాత రెండో ప్రయత్నంలో 105 కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొత్తంగా చాను 190 కేజీలు ఎత్తి కామన్ వెల్త్ గేమ్స్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది.

కాగా ఈ విజయంతో సుశీల్ కుమార్, వినేష్ ఫోగట్‌ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించిన మూడో భారతీయ అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 2018 గోల్డ్ కోస్ట్ , 2022 బర్మింగ్ హామ్ గేమ్స్ లోనూ చాను స్వర్ణాలు గెలిచింది. నైజీరియా రూత్ అసుక్వో న్యోంగ్ (168 కేజీలు) రజతం, మలేసియాకు చెందిన ఐరీన్ జేన్ హెన్రీ (167 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు.

ఇదిలా ఉంటే పతకం అందుకున్నప్పుడు మీరాబాయి చాను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. పోడియం దగ్గర జాతీయ గీతం వినిపిస్తున్నంత సేపూ కన్నీటి పర్యంతమైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడోసారి దేశం తరపున పసిడి పతకం గెలవడం చాలా సంతోషంగా ఉందని మీరాబాయి చాను తెలిపింది.

Mirabai Chanu

స్నాచ్ మరియు క్లీన్ అండ్ జెర్క్ లలో తన మొదటి ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ ఒత్తిడిని అధిగమించి తర్వాత రికార్డు బరువులను ఎత్తగలిగానని మీరాబాయి చాను(Mirabai Chanu) చెప్పింది. రాబోయే రెండు నెలల్లో జరగనున్న ఆసియాక్రీడల్లో రాణించడమే తన ప్రధాన లక్ష్యమని, అందువల్లే కామన్వెల్త్ లో అనవసరమైన రిస్క్ తీసుకోకుండా 3వ ప్రయత్నాన్ని వదిలేశానని వివరించింది.

మరోవైపు పురుషుల వెయిట్ లిఫ్టింగ్‌లో కూడా భారత్‌కు మెడల్ దక్కింది. 60 కేజీల విభాగంలో రిషికాంత సింగ్ రజతం సాధించాడు. మొత్తం 264 కేజీలు రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకూ భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం , ఒక కాంస్యం గెలుచుకుంది.

IND vs ZIM : టీ20 సిరీస్ క్లీన్ స్వీప్..చివరి మ్యాచ్‌లోనూ జింబాబ్వే చిత్తు

Exit mobile version