RCB vs PBKS : ప్లే ఆఫ్స్ కు బెంగళూరు..పంజాబ్ కు ఆరో ఓటమి

RCB vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది

RCB vs PBKS

ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్(RCB vs PBKS) తో మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ పోరు అభిమానులను అలరించింది. పంజాబ్ కింగ్స్(RCB vs PBKS) మరోసారి ఛేజింగ్ లో తడబడి పరాజయం పాలైంది.

మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జాకబ్ బెథెల్ మరోసారి ఫెయిలయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ, పడిక్కల్ ఆర్సీబీ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 76 పరుగులు జోడించారు. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ మరో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అటు పడిక్కల్ కూడా దూకుడుగా ఆడాడు.

పడిక్కల్ 25 బంతుల్లో 45 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. కోహ్లీకి వెంకటేశ్ అయ్యర్ జత కలిసాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ 37 బంతుల్లో 58 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ దూకుడు కొనసాగించాడు. టిమ్ డేవిడ్ తో కలిసి నాలుగో వికెట్ కు 30 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు.

వెంకటేశ్ అయ్యర్ కేవలం 40 బంతుల్లోనే 8 ఫోర్లు,4 సిక్సర్లతో 73 రన్స్ తో నాటౌట్ గా నిలిస్తే టిమ్ డేవిడ్ 28 పరుగులు చేసి ఆఖరి బంతికి ఔటయ్యాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగుల భారీస్కోర్ చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ 2 , చాహల్ 1, అర్షదీప్ సింగ్ 1 వికెట్ పడగొట్టారు.

డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో పంజాబ్ కింగ్స్ చెలరేగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ఓపెనర్లు నిరాశ పరిచారు. ఫస్టాఫ్ లో వరుస విజయాల్లో కీలకపాత్ర పోషించిన ప్రియాన్ష్ ఆర్య(0) , ప్రభ్ సిమ్రన్ సింగ్ (2) వెంటవెంటనే ఔటయ్యారు. శ్రేయాస్ అయ్యర్ (1) కూడా ఔటవడంతో పంజాబ్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

RCB vs PBKS

ఈ దశలో కూపర్ కన్నోలీ, సూర్యాన్ష్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 43 పరుగులు జోడించారు. కన్నోలీ 22 బంతుల్లో 37 (3 ఫోర్లు, 3 సిక్సర్లు) , సూర్యాన్ష్ 22 బంతుల్లో 35 పరుగులకు ఔటయ్యారు. ఇక్కడ నుంచీ స్టోయినిస్ , శశాంక్ సింగ్ పోరాడారు. ఈ జోడీ ఆరో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

వీరిద్దరూ క్రీజులో ఉండడంతో పంజాబ్(RCB vs PBKS) అద్భుతం చేసేలా కనిపించింది. కానీ హ్యాజిల్ వుడ్ స్టోయినిస్ (37) ను పెవిలియన్ కు పంపడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. తర్వాత శశాంక్ సింగ్ (27 బంతుల్లో 56) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులే చేయగలిగింది. పంజాబ్ కు ఇది వరుసగా ఆరో ఓటమి. అటు బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరితే పంజాబ్ కింగ్స్ తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Rajinikanth : నేను పార్టీ పెడితే 100 శాతం గెలిచేవాడిని..విజయ్ అంటే అసూయ లేదన్న రజనీకాంత్

Exit mobile version