Just NationalJust PoliticalLatest News

Rajinikanth : నేను పార్టీ పెడితే 100 శాతం గెలిచేవాడిని..విజయ్ అంటే అసూయ లేదన్న రజనీకాంత్

Rajinikanth : తమిళనాడు సీఎం విజయ్ విజయంపై తనకు అసూయ ఉందంటూ వస్తున్న పుకార్లను సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు

Rajinikanth

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, టీవీకే చీఫ్ విజయ్ గెలిచిన తర్వాత పలువురు స్టార్స్ సోషల్ మీడియా బ్యాచ్ కు బాగా టార్గెట్ అయ్యారు. ఏపీలో పవన్ కళ్యాణ్ , తమిళనాట రజనీకాంత్(Rajinikanth) లపై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరిగింది. ఇటీవలే ఈ ట్రోలింగ్ కు పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు రజనీకాంత్(Rajinikanth) వంతు వచ్చింది. సాధారణంగా తలైవా మీడియాకు దూరంగా ఉంటారు.

సినిమా ఫంక్షన్లలో తప్పిస్తే పెద్దగా మాట్లాడరు. అలాంటి రజనీకాంత్ ఈ ట్రోలింగ్ కు జవాబివ్వాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి స్పందించారు. ఒకదశలో విజయ్ సీఎం కాకుండా రజనీకాంత్ అడ్డుకునేందుకు ప్రయత్నించారన్న ప్రచారం కూడా జరిగింది.వీటన్నింటిపైనా తలైవా మాట్లాడారు.

విజయ్ సీఎం కావడంపై తనకేమీ అసూయ లేదన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే సంచలన ఫలితాలు వచ్చాయంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదన్న రజనీకాంత్ విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు తాను ప్రయత్నించానన్న ప్రచారంలో నిజం లేదన్నారు.అన్ని పార్టీల్లో తనకు అభిమానులున్నారని గుర్తు చేశారు.

గతంలో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి అభిమాన సంఘాలతో సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ కొన్నాళ్లకు అనారోగ్య కారణాలతో ఆ ఆలోచన విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే విజయ్ గెలుపు తర్వాత రజనీ కూడా పార్టీ పెట్టి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

Rajinikanth
Rajinikanth

దీనిపైనా ఆయన స్పందించారు. తాను పార్టీ పెట్టి ఉంటే 100 శాతం గెలిచేవాడినని చెప్పారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఇక మాజీ సీఎం స్టాలిన్ తో భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని తేల్చి చెప్పారు. స్టాలిన్ తనకు మంచి స్నేహితుడనీ, ఓడిపోయిన తర్వాత పరామర్శించేందుకే వెళ్లానన్నారు.

ఇక విజయ్ సీఎం కావడం సంతోషంగా ఉందన్న రజనీకాంత్ కమల్‌హాసన్ ముఖ్యమంత్రి అయితే అసూయపడతానని చమత్కరించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ కంటే విజయ్ పెద్ద విజయం సాధించారని రజనీకాంత్ ప్రశంసించారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను విజయ్ సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్టు రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

Bael Fruit:క్యాన్సర్ రోగులకు సంజీవని.. బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలను కరిగించే అద్భుతమైన పండు

Related Articles

Back to top button