SRH vs RCB : టాప్-2పై సన్ రైజర్స్ కన్ను..హోంగ్రౌండ్ లో ఆర్సీబీతో మ్యాచ్

SRH vs RCB : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి

SRH vs RCB

ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ మూడు జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. బెంగళూరు, గుజరాత్ , హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా.. మిగిలిన ఒక బెర్త్ కోసం గట్టిపోటీనే నెలకొంది. అదే సమయంలో టాప్ 2లో లీగ్ స్టేజ్ ను ముగించేందుకు కూడా తీవ్రమైన పోటీనే ఉంది. ఎందుకంటే టాప్ 2లో నిలిచిన జట్టుకు క్వాలిఫైయర్ లో ఒక మ్యాచ్ ఓడినా మరో అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2పై కన్నేసింది. శుక్రవారం తన హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(SRH vs RCB) తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సన్ రైజర్స్ టాప్ 2లో నిలుస్తుంది. అటు ఆర్సీబీ గెలిచినా కూడా దాదాపు అంతే. దీంతో ఇరు జట్లు టాప్ 2లో ప్లేస్ దక్కించుకోవడమే లక్ష్యంగా తమ చివరి లీగ్ మ్యాచ్ కు సిద్దమయ్యాయి. గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , క్లాసెన్ మంచి ఫామ్ లో ఉండగా.. హెడ్ , నితీశ్ రెడ్డి నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే హోంగ్రౌండ్ లో వీరిద్దరూ కూడా చెలరేగిపోయే అవకాశముంది. బౌలింగ్ లో కమిన్స్ తో పాటు పేసర్లు ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగా, సకిబ్ హుస్సేన్ అదరగొడుతున్నారు. స్పిన్ ఎటాక్ కంటే పేస్ ఎటాక్ అద్భుతంగా రాణిస్తోంది. ఆర్సీబీపై గెలిస్తే టాప్ 2లో ప్లేస్ దక్కించుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ కు ముందు కాన్ఫిడెన్స్ పెరుగుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
SRH vs RCB
SRH vs RCB
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(SRH vs RCB) తన హోదాకు తగ్గట్టే ఈ సీజన్ లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ మరో విజయంతో లీగ్ స్టేజ్ ను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ముంబై, కోల్ కతా, పంజాబ్ జట్లపై హ్యాట్రిక్ విజయాలతో ప్రస్తుతం బెంగళూరు సూపర్ ఫామ్ లో ఉంది. బ్యాటింగ్ లో కోహ్లీ, పడిక్కల్ , పటిదార్ తో పాటు వెంకటేశ్ అయ్యర్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా లాంటి హిట్టర్స్ తో ఉన్న ఆర్సీబీని కట్టడి చేయడం సన్ రైజర్స్ కు అంత ఈజీ కాదు. అటు బౌలింగ్ లోనూ బెంగళూరు పటిష్టంగా ఉంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ , హ్యాజిల్ వుడ్ అదరగొడుతున్నారు. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ కీలకంగా ఉన్నారు. గత రికార్డుల ప్రకారం చూస్తే సన్ రైజర్స్(SRH vs RCB) దే పైచేయిగా ఉంది. ఇక ఉప్పల్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కే అనుకూలంగా ఉంటుంది. GT vs CSK : గుజరాత్ టైటాన్స్ జోరు..చెన్నై సూపర్ కింగ్స్ ఔట్
Exit mobile version