India
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్(India) ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్ కు 30 పరుగులు జోడించారు. స్మృతి (17) ఔటైన కాసేపటికే ధాటిగా ఆడుతున్న షెఫాలీ 31 (15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ ) వెనుదిరిగింది. ఇక్కడ నుంచి భారత్ బ్యాటర్లు ధాటిగా ఆడుతూనే వికెట్లు చేజార్చుకున్నారు.
యస్తికా భాటియా 15, రోడ్రిగ్స్ 12 పరుగులకు ఔటవగా.. తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 33 పరుగులు జోడించారు. హర్మన్ ప్రీత్ 22 బంతుల్లో 2 ఫోర్లతో 24 , దీప్తి శర్మ 21 బంతుల్లో3 ఫోర్లతో 29 పరుగులకు ఔటయ్యారు. తర్వాత రిచా ఘోష్ (15) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. చివర్లో సఫారీ బౌలర్లు కట్టడి చేయడంతో భారత్(India) 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ 2, ఇస్మాయిల్ 2 వికెట్లు పడగొట్టారు.
తర్వాత లక్ష్యఛేదనలో సఫారీలు నిదానంగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. భారత స్పిన్నర్ శ్రీచరణి పవర్ ప్లేలోనే 2 కీలక వికెట్లు పడగొట్టింది. ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ (20), వన్ డౌన్ బ్యాటర్ డెర్క్సెన్ (0)ను ఔట్ చేసింది. అయితే బ్రిట్స్ , మరిజాన్ కాప్ సౌతాఫ్రికాను ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 97 పరుగులు జోడించారు.
బ్రిట్స్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 పరుగులకు ఔటైనా సరే.. కాప్ క్రీజులో ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. చివర్లో శ్రీచరణి డి క్లెర్క్ ను ఔట్ చేయగా భారత్‌కు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే కాప్ అద్భుతమైన షాట్లతో భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కాప్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. సౌతాఫ్రికా మహిళల జట్టుకు వరుసగా ఇది రెండో విజయం.
Body : మీ బాడీలో ఈ 7 సిగ్నల్స్ లైట్ తీసుకుంటున్నారా? అవి మీ ఆరోగ్యంపై శరీరం ఇచ్చే లీకులట..
