AirPods With Camera
యాపిల్ లవర్స్, టెక్ లవర్స్‌కు ఒక క్రేజీ మైండ్ బ్లోయింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం సాంగ్స్ వినడానికి, కాల్స్ మాట్లాడటానికి యూజ్ చేస్తున్న ఎయిర్‌పాడ్స్‌లో త్వరలోనే ఇన్-బిల్ట్ కెమెరాలు రాబోతున్నాయి.
సెన్సేషన్ టెక్నాలజీతో మరోసారి గ్లోబల్ మార్కెట్‌ను కంప్లీట్‌గా షేక్ చేయడానికి ఆపిల్ దిగ్గజ కంపెనీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్నట్లు లేటెస్ట్ లీకులు చెబుతున్నాయి. నిజానికి ఇలాంటి డి ప్రొడక్ట్ 2027 నాటికి వస్తుందని నిపుణులు ఊహించగా, అందరి ఎక్స్‌పెక్టేషన్స్ తలకిందులు చేస్తూ ఈ ఇయర్ గ్రాండ్ లాంచ్ ఉండబోతోందనే న్యూస్ ఇప్పుడు టెక్ వరల్డ్‌లో గట్టిగా చక్కర్లు కొడుతోంది.
ఫేమస్ బ్లూమ్‌బెర్గ్ టెక్ జర్నలిస్ట్ మార్క్ గుర్మాన్ వెల్లడించిన ఇన్ఫో ప్రకారం, ఆపిల్ ప్రస్తుతం 2 రకాల వేర్వేరు వెర్షన్లపై సుదీర్ఘ రీసెర్చ్ చేస్తోంది. దీనిలో B798 అనే కోడ్‌నేమ్‌తో రూపు దిద్దుకుంటున్న అత్యంత అడ్వాన్స్‌డ్ మోడల్ లాంచ్ 2027 సంవత్సరానికి వాయిదా పడింది. అయితే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న B790 అనే మరో వెర్షన్ ప్రస్తుతం స్పీడ్‌గా డెవలప్‌మెంట్ స్టేజీలో ఉంది. విశేషమేమిటంటే దీనికి సంబంధించిన కోడ్ ఇప్పటికే లేటెస్ట్ iOS 27 సాఫ్ట్‌వేర్‌లో క్లియర్‌గా కనిపించింది.
అయితే ఈ B790 అనేది నిజంగానే కెమెరాతో వచ్చే రెవల్యూషనరీ ఎయిర్‌పాడ్స్ మోడలా లేదా సాధారణ ఎయిర్‌పాడ్స్ ప్రోకు ఇచ్చే రొటీన్ హార్డ్‌వేర్ అప్‌డేటా అన్నదానిపై కొంత డౌట్ ఉన్నా కూడా.. iOS సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో యూజర్లకు రెండు వైపులా ఉన్న కెమెరాల ద్వారా ఫొటోలను క్యాప్చర్ చేయడం, డేటాను ప్రాసెస్ చేయడం వంటి కీలక వివరాలు లీకయ్యాయి. ఈ అంశాలను నిశితంగా పరిశీలిస్తే ఇవి కచ్చితంగా ఇన్-బిల్ట్ కెమెరాలు కలిగిన ఎయిర్‌పాడ్స్ అయ్యే అవకాశాలే కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ కొత్త ఎయిర్‌పాడ్స్‌లో ఆపిల్ ప్రెస్టీజియస్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కూడా తీసుకురాబోతోంది. దీనివల్ల యూజర్లు తమ ముందున్న ఏదైనా ప్రదేశాన్ని, పురాతన కట్టడాలను, బుక్స్‌లోని టెక్స్ట్‌ను చూసినప్పుడు ఈ కెమెరాలు వాటిని వెంటనే గుర్తిస్తాయి. ఉదాహరణకు మీరు కిరాణా సామానులు లేదా వెజిటబుల్స్ వైపు చూస్తే, వాటితో ఎలాంటి టేస్టీ రెసిపీలు తయారు చేయొచ్చో కూడా ఈ ఐఐ సిస్టమ్ మీకు వాయిస్ ద్వారా గైడ్ చేస్తుంది.
డిజైన్ పరంగా కూడా పెద్ద చేంజెస్ ఉండబోతున్నాయి. కెమెరా మాడ్యూల్‌ను అమర్చడానికి ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పాడ్స్ ప్రో కంటే కొంచెం పొడవైన స్టెమ్ , క్యాప్చర్ చేసిన డేటాను క్లౌడ్‌కు పంపే టైంలో ప్రైవసీ ఇండికేషన్ కోసం స్పెషల్‌గా LED లైటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నాయి.
ఇవన్నీ ప్రస్తుతం లీక్ అయిన బేసిక్ డిటెయిల్స్ మాత్రమే కాబట్టి, రాబోయే రోజుల్లో ఆపిల్ చేసే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఈ కెమెరా ఎయిర్‌పాడ్స్ సెప్టెంబర్‌లోనే లాంచ్ అవుతాయా లేదా అనేది పూర్తి క్లారిటీ రాబోతోంది.
Prashant Kishor : వ్యూహకర్తగా కాదు నాయకుడిగా హిట్..బీజేపీ కంచుకోట బంకీపూర్‌లో పీకే సంచలనం
