Prashant Kishor : వ్యూహకర్తగా కాదు నాయకుడిగా హిట్..బీజేపీ కంచుకోట బంకీపూర్‌లో పీకే సంచలనం
Prashant Kishor : సుమారు 30 ఏళ్ల పాటు కేవలం బీజేపీ హవా మాత్రమే నడిచిన ఈ స్థానంలో, జేఎస్పీ నేత ప్రశాంత్ కిషోర్ వచ్చి ఊహించని రీతిలో జయకేతనం ఎగురవేయడం అక్కడ హాట్ టాపిక్ అయింది.
Prashant Kishor
దేశంలో ఎంతోమంది దిగ్గజ పొలిటికల్ లీడర్స్‌ను గెలిపించి, పవర్ ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) డైరెక్ట్ పాలిటిక్స్‌లో తొలిసారి దిగి అద్భుత విజయాన్ని సాధించారు. బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బై ఎలక్షన్లో జన్ సూరజ్ పార్టీ (జేఎస్పీ) అధినేతగా పోటీ చేసిన పీకే.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గ్రాండ్ విక్టరీ సాధించి తొలిసారి చట్టసభలోకి అడుగుపెడుతున్నారు. 3 దశాబ్దాలుగా తిరుగులేని బీజేపీ కంచుకోటగా ఉన్న స్థానంలోనే జెండా పాతడం ద్వారా భారత రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు.
బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. గెలుపొందిన సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ నబీన్ 2026 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికవ్వడంతో తన శాసనసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. దీంతో ఈ ప్లేస్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది.
తమకు బలమైన పట్టున్న ప్రాంతం కావడంతో నితిన్ నబీన్‌కు అత్యంత సన్నిహితుడు, ఫ్రెండ్ నీరజ్ కుమార్ సిన్హాను బీజేపీ బరిలోకి దించింది. అలాగే ఆర్జేడీ తరఫున రేఖా కుమారి గుప్తా పోటీ పడ్డారు. జులై 30వ తేదీన పోలింగ్ జరగ్గా, ఆగస్టు 3న వెలువడిన ఫలితాల్లో నీరజ్ కుమార్ సిన్హాపై ఏకంగా 20 వేలకు పైగా భారీ ఓట్ల మెజారిటీతో పీకే గ్రాండ్ విక్టరీ సాధించి అధికార పార్టీకి అనూహ్య షాక్ ఇచ్చారు.
నిజానికి ఈ నియోజకవర్గానికి చాలా సుదీర్ఘమైన పొలిటికల్ హిస్టరీ ఉంది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇది పాట్నా పశ్చిమ అసెంబ్లీ స్థానంగా ఉండేది. 1995 నుంచి 2005 వరకు బీజేపీ నేత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా ఇక్కడి నుంచి వరుసగా 4 సార్లు గెలుపొందారు.
ఆ తర్వాత 2006 నుంచి 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కొడుకు నితిన్ నబీన్ ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇలా సుమారు 30 ఏళ్ల పాటు కేవలం బీజేపీ హవా మాత్రమే నడిచిన ఈ స్థానంలో, జేఎస్పీ నేత ప్రశాంత్ కిషోర్ వచ్చి ఊహించని రీతిలో జయకేతనం ఎగురవేయడం అక్కడ హాట్ టాపిక్ అయింది.

ఇప్పటి వరకూ తెర వెనుక ఉండి పెద్ద పెద్ద నాయకుల గెలుపోటములను శాసించే ప్రశాంత్ కిషోర్(Prashant Kishor), ఈసారి తానే స్వయంగా ప్రజా క్షేత్రంలోకి దిగి పోటీచేసి గెలవడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది . కేవలం సొంత బలం, ప్రజల్లోకి వెళ్లిన తీరుతో బిహార్ పాలిటిక్స్‌లో సరికొత్త సంచలనానికి తెర దీశారు.
బీజేపీ నుంచి కంచుకోటలాంటి బంకీపూర్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు, ఆర్జేడీ వంటి ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా దాటుకుని.. ఈ రేంజ్లో మెజారిటీ సాధించడంతో రాబోయే రోజుల్లో పీకే లీడర్‌షిప్‌లోని జన్ సూరజ్ పార్టీ బిహార్ పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌ను ఎలా మార్చబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





