Custom Lists
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న వాట్సాప్, వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటుంది. దీనిలో భాగంగానే ఇటీవల వచ్చిన కస్టమ్ లిస్ట్స్(Custom Lists) ఫీచర్ చాటింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. సాధారణంగా మనందరికీ వాట్సాప్‌లో వందలాది మెసేజ్‌లు వస్తుంటాయి.
వాటిలో ముఖ్యమైన వ్యక్తులది కానీ ఆఫీసు గ్రూపులు, కుటుంబ సభ్యుల చాట్‌లను కానీ వెతకడం ఒక్కోసారి తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వాట్సాప్ ఈ సరికొత్త ఆర్గనైజింగ్ టూల్‌ను తీసుకువచ్చింది. దీనిలో మీకు నచ్చిన పేర్లతో స్పెషల్ లిస్టులను క్రియేట్ చేసుకుని, సంబంధిత చాట్‌లను అందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వర్క్,బిజినెస్ అని వేర్వేరు లిస్టులు పెట్టుకుంటే, ఒక్క క్లిక్‌తోనే ఆ గ్రూపులోని మెసేజ్‌లను మాత్రమే చూసే వీలుంటుంది.
ఈ ఫీచర్ వాడటం కూడా చాలా ఈజీ. మీ వాట్సాప్ స్క్రీన్ పైన ఉండే ఫిల్టర్ల దగ్గర ప్లస్ గుర్తును క్లిక్ చేసి కొత్త లిస్టును తయారు చేయొచ్చు. ఇప్పటి వరకూ ఉన్న ఆల్(All), అన్‌రీడ్( Un Read), గ్రూప్స్(Groups) వంటి ఆప్షన్లతో పాటు ఇప్పుడు మీరు సొంతంగా క్రియేట్ చేసిన స్పెషల్ కస్టమ్ లిస్టులు(Custom Lists) కూడా కనిపిస్తాయి.
ఇది కేవలం పర్సనల్ చాట్‌లకే కాకుండా, బిజినెస్ చేసే వారికి కూడా ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కస్టమర్లను, ఆర్డర్లను వేర్వేరుగా డివైడ్ చేయడానికి ఇది ఒక వన్-స్టాప్ సొల్యూషన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల ముఖ్యమైన మెసేజ్‌లను మిస్ అవుతున్నామన్న భయం ఉండదు.
