Heavy Rain : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు..

Heavy Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Heavy Rain

వానా కాలం వెళ్లిపోయింది. చలికాలం కంటిన్యూ అవుతుంది.. అయినా కూడా తీవ్ర ఉష్ణోగ్రతలు, వేడి గాలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ వాసులకు వరుణుడు ఊహించని రిలీఫ్‌ను అందించాడు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఎఫెక్ట్‌తో భాగ్యనగరం వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం కూల్ అయి, చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం ముంచెత్తింది. సాయంత్రం నుంచి ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి దట్టమైన చీకట్లు అలుముకోవడంతో..చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొడుతోంది(Heavy Rain).

హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు అయిన శంషాబాద్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, నానక్‌రామ్‌గూడ, షేక్‌పేట్, మణికొండ, టోలీచౌకిల్లో భారీ వర్షపాతం(Heavy Rain) నమోదైంది. అలాగే కాప్రా, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్‌కేసర్, కీసర, నాగారం, చర్లపల్లి ఏరియాల్లో కూడా రహదారులు జలమయమయ్యాయి.

నగర నడిబొడ్డున ఉన్న అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, హిమాయత్‌నగర్‌తో పాటు ఎల్‌బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్ ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది.

ఈ అనుకోని వర్షం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే పడటంతో ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం ధాటికి రోడ్డుపైన నీరు చేరడంతో సిటీలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ మార్గాల్లో వెహికల్స్ కిలోమీటర్ల వరకూ నిలిచిపోయాయి.

కాగా ఈ తుపాను ప్రభావంతో మరో కొద్ది గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో, అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని, అలాగే ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా ఎన్నో రోజుల నుంచి వానచినుకు కోసం ఎదురు చూస్తున్న భాగ్యనగరవాసులకు ఈ భారీ వర్షంతో బాగా రిలీఫ్ దొరికినట్లు అయింది.

Comrade Kalyan : ప్రైమ్‌లో శ్రీవిష్ణు హంగామా..సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్..

↑
Exit mobile version