Hyderabad Water Crises
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జలమండలి కోలుకోలేని బిగ్ షాక్ ఇచ్చింది. రాబోయే 8 నెలల పాటు భాగ్యనగరంలో తీవ్ర స్థాయిలో తాగే నీటి ఎద్దడి తలెత్తబోతోందని(Hyderabad Water Crises) జలమండలి స్పష్టం చేసింది. వర్షాభావ పరిస్థితులు, ఎండల ధాటికి మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకరంగా అడుగంటిపోవడమే దీనికి మెయిన్ రీజన్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.
మంజీరా, సింగూరు ప్రాజెక్టులు ఎండిపోవడంతో సిటీకి రోజుకు ఏకంగా 100 మిలియన్ గ్యాలన్ల (MGD) వాటర్ కొరత ఏర్పడనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలై సెప్టెంబర్ నెల వరకు ఈ జల గండం కొనసాగే అవకాశం ఉంది.
ఈ ఊహించని నీటి ముప్పు నుంచి సిటీజనులను గట్టెక్కించడానికి అధికారులు అత్యవసర ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా గోదావరి నుంచి 100 MGD, కృష్ణా నది నుంచి 10-15 MGD, అలాగే ఉస్మాన్‌సాగర్ నుంచి మరో 5 MGD వాటర్‌ను అదనంగా నగరానికి మళ్లించడానికి చర్యలు చేపడుతున్నారు. అయితే, ఈ ఆల్టర్నేటివ్ మార్గాల ద్వారా కేవలం 60 శాతం కొరతను మాత్రమే పూడ్చగలరని, మిగిలిన 20-40 శాతం నీటి కొరత సిటీలో కచ్చితంగా ఉంటుందని అధికారులు ఒప్పుకున్నారు.
ఈ డ్రింకింగ్ వాటర్ సంక్షోభం గ్రేటర్ పరిధిలోని దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై కోలుకోలేని దెబ్బ తీయబోతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని శేరిలింగంపల్లిలో ఏకంగా 80 శాతం వరకు నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
పటాన్చెరు నుంచి నార్సింగి వరకు విస్తరించి ఉన్న సిటీ శివారు ఏరియాలోని దాదాపు 3 లక్షల గృహ కనెక్షన్లకు వచ్చే కొన్ని నెలల్లో నీటి సరఫరాలో కొన్ని అంతరాయాలు కలగడం గ్యారంటీ అనిపిస్తోంది. అందుకే పరిస్థితులు చేయి దాటిపోక ముందే ఇప్పటి నుంచే ఇళ్లలో ప్రతీ నీటి బొట్టును జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Aadarsha Kutumbam Review : ఆదర్శ కుటుంబం ప్రివ్యూ రిపోర్ట్..వెంకీ,త్రివిక్రమ్ కాంబో అదిరిందా లేదా?
