Khairatabad By Election : ఎస్‌ఐఆర్ తర్వాత మొదటి సమరం.. సిటీ పీఠం దక్కించుకునేది ఎవరు?

Khairatabad By Election : రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఖైరతాబాద్ బై ఎలక్షన్‌ను ..సెమీఫైనల్‌గా భావిస్తున్న మెయిన్ పొలిటికల్ పార్టీలు తమ పవర్, స్ట్రాటజీలను ప్రూవ్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.

Khairatabad By Election

తెలంగాణ పాలిటిక్స్ ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గం చుట్టూ రౌండ్-అప్ అవుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ బై ఎలక్షన్‌ను ..సెమీఫైనల్‌గా భావిస్తున్న మెయిన్ పొలిటికల్ పార్టీలు తమ పవర్, స్ట్రాటజీలను ప్రూవ్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.

తెలంగాణలో పవర్‌లోకి వచ్చిన తర్వాత గ్రేటర్ పరిధిలో జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ రెండు బై ఎలక్షన్స్‌లోనూ వరుస విజయాలను సాధించి విక్టరీ ట్రాక్‌లో ఉన్న కాంగ్రెస్.. ఖైరతాబాద్‌లో కూడా జెండా పాతేసి హైదరాబాద్‌ సిటీపై తమ తిరుగులేని పట్టును చాటడానికి స్కెచ్ వేస్తోంది.

ఇంకోవైపు 2023లో తమ సొంతం చేసుకున్న ఖైరతాబాద్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవడం ద్వారా తాము ఇంకా కూడా గ్రేటర్‌లో స్ట్రాంగ్‌గానే ఉన్నామని రాష్ట్ర రాజకీయాలకు గట్టి మెసేజ్ ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది.

ఇక తెలంగాణలో అధికార పీఠమే టార్గెట్‌గా మెల్లమెల్లగా పావులు కదుపుతూ వస్తున్న బీజేపీ, ఈ ఉప ఎన్నికలలో నెగ్గి తమ కేడర్‌లో కొత్త జోష్ నింపడానికి ఉవ్విళ్లూరుతోంది.

మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రాసెస్ ముగిసిన తర్వాత జరగనున్న ఫస్ట్ ఎన్నికలు కావడంతో ఈ ఖైరతాబాద్ పోరుకు(Khairatabad By Election) విపరీతమైన పొలిటికల్ ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి తోడు ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా అఫీషియల్‌గా రిలీజ్ చేయడంతో ఎన్నికల గురించి నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావొచ్చని పార్టీలన్నీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ షురూ చేశాయి.

అసలు ఈ ఖైరతాబాద్ సీటు వెనుక పాత లెక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే.. 2024 ఏప్రిల్ 23 నుంచే ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లుగా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని శాసనసభ సెక్రటరీ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు.

2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత హస్తం గూటికి మారడంతో దానంపై పడిన అనర్హత వేటు 2024 ఏప్రిల్ 23 నుంచే అమలులోకి వచ్చినట్లు తేల్చేశారు.

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్‌గా దానం నాగేందర్‌కి 63వేల68 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 34వేల666 ఓట్లు, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.విజయారెడ్డికి 33వేల549 ఓట్లు వచ్చాయి. దీంతో దానం 28,402 ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు.

అయితే గెలిచిన కొంతకాలానికే దానం అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్ చేసి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అక్కడ బీజేపీ నుంచి నిలబడ్డ కిషన్ రెడ్డి 4లక్షల73వేల 12 ఓట్లతో విజయాన్ని సాధించగా, దానం 4లక్షల23వేల 68 ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు 1లక్ష29వేల586 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్‌కు పరిమితమైనా కూడా, ఒక్క ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మాత్రం గులాబీ పార్టీకే హయ్యెస్ట్ లీడ్ వచ్చింది. ఎంపీ పోరులో ఖైరతాబాద్ పరిధి వరకు బీఆర్ఎస్ క్యాండిడేట్ పద్మారావుకు 67వేల368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన దానం నాగేందర్‌కు 45వేల358 ఓట్లు, బీజేపీ నుంచి నిలబడ్డ కిషన్ రెడ్డికి 38వేల94 ఓట్లు దక్కాయి.

అంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఖైరతాబాద్‌(Khairatabad By Election)లో బీఆర్ఎస్ ఏకంగా 22 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని సాధించి తన సత్తా చాటుకుంది. అయితే ఇప్పుడు రాబోయేది డైరెక్ట్ బై ఎలక్షన్ కావడంతో, లోకల్ ఈక్వేషన్స్, పవర్‌లో ఉన్న పార్టీ ప్రభావం, అభ్యర్థుల ఇమేజ్ వంటి అంశాలు ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక బరిలో దిగనున్న అభ్యర్థుల విషయానికి వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ రేసులోకి దిగడం దాదాపు కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నా కూడా.. పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి అలాగే మరికొంతమంది సీనియర్లు కూడా ఈ టికెట్ రేసులో తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి పేర్లు మెయిన్‌గా వినిపిస్తున్నా.. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పేరే ఎక్కువగా తెరపైకి వస్తోంది.

Khairatabad By Election

ఇక భారతీయ జనతా పార్టీ విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే ఇంద్రసేనారెడ్డి, జూటూరి కీర్తి రెడ్డి కూడా ఈ రేసులో గట్టిగానే పొటీ పడుతున్నారు.

మొత్తంగా ఈ మూడు ప్రధాన పార్టీలు తమ ఉనికిని, పట్టును చాటుకోవడానికి ఈ ప్లేస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఖైరతాబాద్ ఇప్పటినుంచే హీటెక్కిపోతోంది. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు విక్టరీని సొంతం చేసుకుంటారో..సిటీ పొలిటికల్ సునామీ ఏ పార్టీ వైపు మొగ్గుతుందో చూడాలి.

Cut Off vs Space In Relationship : బంధాల్లో కట్ ఆఫ్ వర్సెస్ స్పేస్.. బంధాలలో బౌండరీలు దాటితే ఏమవుతుంది?

↑
Exit mobile version