Chandrababu: నవంబర్ విశాఖ సమ్మిట్ లక్ష్యంగా చంద్రబాబు గ్లోబల్ టూర్.. బ్రాండ్ అంబాసిడర్ బాబు
Chandrababu: సీఎం చంద్రబాబు అక్టోబర్ 22-24 మధ్య దుబాయ్, అబుదాబీలో రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఫైనాన్స్ రంగాలపై, నవంబర్ 2-5 మధ్య లండన్‌లో గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.

Chandrababu
ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandrababu) నాయుడు బ్రాండ్ ఏపీని పునరుద్ధరించే కసరత్తును ప్రారంభించారు. ఈ ప్రయత్నాలన్నీ నవంబర్‌లో విశాఖపట్నంలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన CII భాగస్వామ్య సదస్సు 2025 వైపు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ 30వ ఎడిషన్ CII సమ్మిట్‌ను కేంద్రంలోని వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనుంది.
ఈ సదస్సు నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. దీని థీమ్”Technology, Trust, and Trade: Navigating the New Geoeconomic Order..గా నిర్ణయించారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, యుకే, దుబాయ్, జర్మనీ సహా 60కి పైగా దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.
సదస్సుకు ముందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu), రాష్ట్ర మంత్రులు వివిధ దేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అక్టోబర్ 22-24 మధ్య యుఎఈ (దుబాయ్, అబుదాబీ) లో రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఫైనాన్స్ రంగాలపై, నవంబర్ 2-5 మధ్య లండన్‌లో గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా ‘రిఅలిస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్ కమిట్‌మెంట్స్’ సాధించడం చంద్రబాబు లక్ష్యం.

మంత్రివర్గం కూడా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఐటీ మంత్రి నారా లోకేష్ టెక్, ఇన్నోవేషన్ కోసం ఆస్ట్రేలియాలో.. టీ.జి. భరత్ గఆటోమొబైల్, రోబోటిక్స్ కోసం జపాన్‌లో.. బీసీ జనార్ధన్ రెడ్డి కొరియాలో స్టీల్ సహకారం కోసం.. కొండపల్లి శ్రీనివాస్ జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో ఇంజనీరింగ్ పెట్టుబడుల కోసం పర్యటనలు చేస్తున్నారు.
‘బ్రాండ్ అంబాసిడర్’ చంద్రబాబు విజన్: చంద్రబాబు(Chandrababu) నాయకత్వంలో 2024-25లో మాత్రమే రూ. 9.34 లక్షల కోట్ల విలువైన 340కి పైగా ఎంఓయూలు కుదిరాయి, సుమారు 25 లక్షల ఉద్యోగాల సృష్టికి వీలు కలిగింది. ఇటీవలే రూ. 1.14 లక్షల కోట్ల విలువైన కొత్త పెట్టుబడులను SPIB ఆమోదించింది. ఇందులో భారతదేశంలోనే అతి పెద్దదైన రూ.87,520 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ (Raiden Infotech India Ltd) కూడా ఉంది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమ్మిట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ‘టెక్నాలజీ & ట్రేడ్ హబ్’గా ప్రపంచానికి ప్రొజెక్ట్ చేయనున్నారు. గత 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడుల కంటే రెండు రెట్లు ఎక్కువ ఎంఓయూలు ఈసారి కుదుర్చుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, పోర్టులు, గ్రీన్ హైడ్రోజన్, రిన్యూవబుల్స్, సెమీకండక్టర్లు వంటి కీలక రంగాలలో పెట్టుబడులను ఆశిస్తున్నారు.
ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభించి, రాష్ట్రాల ఆర్థిక వృద్ధి ప్రాధాన్యతపై మాట్లాడనున్నారు. విశాఖ సదస్సు తర్వాత ఏపీకి దాదాపు రూ.2–3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కమిట్‌మెంట్లు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. చంద్రబాబు యొక్క ‘గ్లోబల్ బ్రాండింగ్’ విధానం ద్వారా ఏపీ దేశంలోని పెట్టుబడులకు అగ్ర గమ్యస్థానంగా మారగలదనే బలమైన అంచనాలు నెలకొన్నాయి.
One Comment