Infections : చలి ముగిసి ఎండలు మొదలయ్యే వేళ.. ఈ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్త!
Infections : ప్రస్తుతం మనం ఒక సీజన్ ముగిసి మరో సీజన్ లోకి ప్రవేశించే మధ్య కాలంలో ఉన్నాం. చలికాలం వెళ్లిపోతూ ఎండాకాలం ఆహ్వానం పలుకుతున్న ఈ సమయంలో మన శరీరం వాతావరణంలో వచ్చే మార్పులకు త్వరగా ప్రభావితం అవుతుంది
Infections
ప్రస్తుతం మనం ఒక సీజన్ ముగిసి మరో సీజన్ లోకి ప్రవేశించే మధ్య కాలంలో ఉన్నాం. చలికాలం వెళ్లిపోతూ ఎండాకాలం ఆహ్వానం పలుకుతున్న ఈ సమయంలో మన శరీరం వాతావరణంలో వచ్చే మార్పులకు త్వరగా ప్రభావితం అవుతుంది.
ముఖ్యంగా ఉదయం పూట ఎండ, రాత్రి పూట చలి ఉండటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు(Infections), జలుబు, దగ్గు, గొంతు నొప్పి , ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి.
ముందుగా మన ఆహారపు అలవాట్లలో తప్పనిసరిగా కొన్ని మార్పులు చేసుకోవాలి. వాతావరణం మారుతున్నప్పుడు వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. నీటిని ఎప్పుడూ కాచి చల్లార్చి తాగడం వల్ల.. నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లను అరికట్టొచ్చు. రోజూ అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్స్ మన వంటల్లో ఉండేలా చూసుకోవాలి.
రోజూ రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపు వేసిన పాలు తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు(Infections) రాకుండా ఉంటాయి. అలాగే విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరి, నిమ్మ వంటి పండ్లు మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి వైరస్లతో పోరాడే శక్తిని ఇస్తాయి.

ఇక వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో కూడా అశ్రద్ధ చేయకూడదు. బయట నుంచి ఇంటికి రాగానే చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. దుమ్ము, ధూళి వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉండటంతో పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ సమయంలో కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు పెరుగుతాయి.. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.
చిన్నపిల్లలు , వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఒకవేళ జ్వరం లేదా దగ్గు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మన ఇంటి చిట్కాలు, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా బయటపడొచ్చు.
HCA : యువ క్రికెటర్ల కెరీర్ తో ఆడుకోవద్దు..హెచ్ సీఏకు టీసీఏ వార్నింగ్



