Just InternationalLatest News

Eiffel Tower: ఈఫిల్ టవర్ ఎత్తు ఎలా పెరిగిందో తెలుసా?

Eiffel Tower: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈఫిల్ టవర్ నిర్మాణం 1887 జనవరి 28న ప్రారంభమై, 1889 మార్చి 15 నాటికి పూర్తయ్యింది.

Eiffel Tower

ప్రపంచంలోనే ఎత్తయిన, అత్యంత ప్రసిద్ధి చెందిన కళాఖండంగా ఈఫిల్ టవర్ (Eiffel Tower) ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. నిజానికి ఆకాశానికి తాకుతున్నట్లు కనిపించే ఈ టవర్ ఎత్తు గతంలో 324 మీటర్లు (1063 అడుగులు) ఉండేది. అయితే, టవర్ చివరి భాగంలో కొత్తగా దాదాపు ఆరు మీటర్ల (19.69 అడుగుల) డిజిటల్ రేడియో యాంటెన్నాను అమర్చడం వల్ల, ఈఫిల్ టవర్ ఎత్తు తాజాగా 330 మీటర్లకు పెరిగింది.

ఐఫిల్ ఇంజనీర్ పేరు మీదే… ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ ఐరన్ టవర్ నిర్మాణం 1887 జనవరి 28న ప్రారంభమై, 1889 మార్చి 15 నాటికి పూర్తయ్యింది. ‘గుస్తావ ఐఫిల్’ అనే ఫ్రెంచ్ సివిల్ ఇంజినీరింగ్ సంస్థ దీనిని రూపొందించింది. ఆయన పేరు మీదే మొదట దీనికి ‘ఐఫిల్’ అనే పేరు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఇది ‘ఈఫిల్ టవర్’గా ప్రసిద్ధి చెందింది.

Eiffel Tower
Eiffel Tower

నిర్మాణ ఉద్దేశం.. 130 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ టవర్‌(Eiffel Tower)ను తొలుత ఒక అంతర్జాతీయ ప్రదర్శన (1889లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ప్రదర్శన) సందర్భంగా తాత్కాలికంగా మాత్రమే ఉంచాలని అనుకున్నారు. కానీ, శతాబ్దానికిపైగా ఇది ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుండటంతో శాశ్వతంగా ఉంచబడింది. దీనిని కేవలం పర్యాటక ఆకర్షణగానే కాకుండా, టవర్ పైభాగంలో యాంటెన్నాలను అమర్చి ప్రసారాల కోసం (టెలివిజన్, రేడియో) కూడా ఉపయోగిస్తున్నారు.

ఎత్తు పెరుగుదల రహస్యం.. ఈఫిల్ టవర్(Eiffel Tower) ఎత్తు స్వల్పంగా మారుతూ ఉండటానికి కారణం దాని పైభాగంలో మార్చే యాంటెన్నాలే. తాజాగా, టవర్ పైభాగంలో ఉన్న పాత యాంటెన్నా స్థానంలో ఓ డిజిటల్ రేడియో యాంటెన్నాను మార్చారు. ఈ ప్రక్రియను హెలికాప్టర్ సహాయంతో కేవలం 10 నిమిషాల్లోనే పూర్తి చేశారు. కొత్తగా అమర్చిన ఈ యాంటెన్నా ఆరు మీటర్లు పొడవు ఉండటంతో, టవర్ మొత్తం ఎత్తు 330 మీటర్లకు చేరింది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button