Just NationalJust Andhra PradeshJust TelanganaLatest News

Kurnool bus accident: నిర్లక్ష్యమే బలి తీసుకుంది..  ఈ పాపం ట్రావెల్స్ సంస్థదే

Kurnool bus accident: ఆర్టీవో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పటికప్పుడు బస్సుల ఫిట్ నెస్ ను చెక్ చేయడం కూడా అధికారుల బాధ్యతే.

Kurnool bus accident

కర్నూలు బస్సు(Kurnool bus accident) ప్రమాదఘటనతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయానికల్లా తమ తమ గమ్యాస్థానాలు చేరుకుంటామని హాయిగా నిద్రపోతున్న ప్రయాణికులు నిద్రలోనే కన్నుమూశారు. ఈ దుర్ఘటనకు కారణం సంస్థ నిర్లక్ష్యంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని తెలుస్తోంది.ప్రమాదానికి గురైన కావేరి సంస్థ బస్సు 2018 లో కొన్నారు. ఇది సెకండ్‌ హ్యాండ్‌ బస్‌. దీన్ని

ఫస్ట్‌ డయ్యూ డామన్‌లో రిజిస్టర్‌ చేయించారు. ఆ రిజిస్ట్రేషన్‌లోనే చాలా కాలం బస్‌(Kurnool bus accident) నడిచింది. తరువాత 2015లో ఒడిశాలో మరోసారి రీ-రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఫిట్‌నెస్‌ విషయంలో ఈ బస్‌ పక్కాగానే ఉందా అంటే ఈ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇక ఇదే మొదటి ప్రమాదం కూడా కాదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ బస్సుపై 16 పెండింగ్ ఛలానాలు ఉన్నాయి. అన్ని ఛలానాలు ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే పడడం చూస్తే ఏ స్థాయిలో వీరు మితిమీరిన వేగంతో నడుపుతున్నారో అర్థమవుతోంది.

Kurnool bus accident
Kurnool bus accident

తాజా (Kurnool bus accident)ప్రమాదానికి కూడా ఓవర్‌ స్పీడే కారణం. రాత్రి దాదాపు 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి వెళ్లిన బస్‌ తెల్లవారుజామున సుమారు 3 గంటలకు కర్నూల్‌ టూ బెంగళూరు హైవే మీద ప్రమాదానికి గురైంది. బస్‌కు ముందు వెళ్తున్న ఓ బైక్‌ను బస్‌ ఢీ కొట్టింది. ఢీ కొట్టిన వెంటనే బస్‌ను పక్కకి ఆపితే ఇంత ప్రమాదం జరిగిదే కాదు. కానీ బస్‌ డ్రైవర్‌ అలాగే బైక్‌తో పాటే కొంత దూరం ముందుకు వెళ్లిపోయాడని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

Kurnool bus accident
Kurnool bus accident

అలా ముందుకు వెళ్లడంతో బైక్‌ నుంచి పెట్రోల్‌ లీక్‌ అవడం, మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించాయి. మంటలను ఫైర్ సేఫ్టీతో ఆర్పకుండా నీళ్ళతో ఆర్పేందుకు ప్రయత్నించడం ప్రమాద తీవ్రతను పెంచేసింది. ఫలితంగా పరిస్థితి చేయిదాటిపోయి… బస్‌లో వేగంగా మంటలు వ్యాపించాయి. ఈ పరిస్థితి ప్రత్యక్షంగా చూసిన డ్రైవర్‌ పారిపోయాడు. మంటల వేడికి హైడ్రాలిక్ కేబుల్స్‌ లాక్‌ అవ్వడంతో డోర్లు కూడా తెరుచుకోలేదు. అద్దాలు పగలగొట్టుకుని కొందరు కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నా…చాలా మంది ఆ మంటల్లో చిక్కుకపోయారు.

దీంతో కావేరీ ట్రావెల్స్‌ నిర్లక్ష్యానికి వీరంతా బలైపోయారని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నా, చలాన్లు ఉన్నా.. ఆర్టీవో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పటికప్పుడు బస్సుల ఫిట్ నెస్ ను చెక్ చేయడం కూడా అధికారుల బాధ్యతే. కానీ ఎప్పుడో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తూతూమంత్రంగా రెండు,మూడు రోజులు తనిఖీలు నిర్వహించి తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. ఆర్టీవో అధికారుల తనిఖీలు రెగ్యులర్ గా ఉంటే ఇలాంటి ఘటనలు జరగవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Water: నీళ్లు తాగడానికీ ఒక సమయం ఉందట.. ఇది నిపుణుల మాట

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button