Bigg Boss: బిగ్‌బాస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్..ఘాటైన కారణాలతో డస్ట్‌బిన్ పనిష్మెంట్
Bigg Boss: ఎలిమినేట్ అయిన తర్వాత కూడా రమ్య మోక్ష ఎక్కడా తన ఫేస్‌లో చిన్న చిరునవ్వు కూడా చెదరకుండా, చాలా హ్యాపీగా బయటికొచ్చింది.
Bigg Boss
బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్లో అందరూ ఊహించినట్లుగానే రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. నటి తనూజను నామినేట్ చేసి ఇంటి నుంచి బయటకు పంపించేద్దామని ప్లాన్ చేసిన రమ్య మోక్షకు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా పెద్ద షాక్ ఇచ్చారు. అయితే, ఎలిమినేట్ అయిన తర్వాత కూడా రమ్య మోక్ష ఎక్కడా తన ఫేస్‌లో చిన్న చిరునవ్వు కూడా చెదరకుండా, చాలా హ్యాపీగా బయటికొచ్చింది.
ఎలిమినేషన్ ప్రక్రియలో నాగార్జున ట్విస్ట్.. బిగ్‌బాస్(Bigg Boss) ఆదివారం ఎపిసోడ్లో నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరినీ సేవ్ చేయగా చివరికి రమ్య , సంజన డేంజర్ జోన్లో మిగిలారు. ఎలిమినేషన్‌కి సమయం అయిందని ప్రకటించిన నాగార్జున, రమ్య-సంజనలను యాక్టివిటీ రూమ్‌కి పిలిచి ‘మీ ఇద్దరి పైనా క్లౌడ్స్ ఆర్ వెయిటింగ్.. ఎవరి మేఘం నుంచి అయితే వర్షం పడుతుందో వాళ్లు సేఫ్, ఎవరి మేఘం అయితే వర్షించదో వాళ్లు ఎలిమినేటెడ్’ అంటూ ట్విస్ట్ (Bigg Boss)ఇచ్చారు.
ఇమ్మానుయేల్ దగ్గర ఉన్న పవరాస్త్రకు సేవింగ్ పవర్ కేవలం లాస్ట్ వీక్ మాత్రమే ఉందని, అది ఇప్పుడు పనిచేయదని నాగ్ స్పష్టం చేశారు. అలాగే, తనూజ గెలుచుకున్న గోల్డెన్ బజర్ పవర్ కూడా వచ్చే వారం నుంచే పనిచేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తనకు సేవింగ్ పవర్ ఉంటే ఎవరిని సేవ్ చేస్తావని నాగ్ తనూజని అడగగా, ‘సంజన గారినే సేవ్ చేస్తాను. ఆమె చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు, ఏది చేసినా ఫన్‌గానే చేస్తారు, హార్ట్‌లో ఏం ఉండదు’ అని తనూజ వివరణ ఇచ్చింది.

చివరకు సంజన తల మీద ఉన్న మేఘం నుంచి వర్షం కురిసింది. దీంతో ‘రమ్య, యూ ఆర్ ఎలిమినేటెడ్.. సంజన నువ్వు సేఫ్’ అని నాగ్ ప్రకటించారు. రమ్య వెంటనే సంజనకి హగ్ ఇచ్చి ‘చెప్పా కదా నువ్వు ఉంటావని’ అంది. ‘అప్పుడే వెళ్లిపోతున్నావ్ ఏంట్రా’ అని సంజన అడిగితే ‘టైమ్ వచ్చింది, నన్ను బయట పిలుస్తున్నారు, వెళ్లాలి’ అని రమ్య నవ్వుతూ చెప్పింది.
ముద్దులతో ముంచేసిన మాధురి.. యాక్టివిటీ రూమ్ నుంచి బయటికి రాగానే డీమాన్ (పవన్) నిల్చొని ఉండగా, రమ్య అతనికి ‘బై పవన్’ అని చెప్పింది. సుమన్ శెట్టి నుదుటి మీద కిస్ ఇచ్చి బై చెప్పింది. మాధురి వచ్చి రమ్యని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టింది. ‘ఏడవద్దు మీరు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.. నువ్వు ఫస్ట్ ఏం చెప్పావో అలాగే చెయ్, బై లవ్యూ, బయటికొచ్చాక కలుద్దాం, జాగ్రత్త, ఎక్కువ అరవకు’ అంటూ మాధురికి రమ్య సలహాలు ఇచ్చింది. ‘నేను నెక్స్ట్ వీక్ వచ్చేస్తా’ అంటూ మాధురి ఏడుస్తూ చెప్పింది. తర్వాత తనూజ సహా అందరికీ బై చెప్పేసి రమ్య వెళ్తుంటే ‘రేయ్ నాకు బై కూడా చెప్పవా రమ్య’ అంటూ రీతూ అడిగింది. ‘సారీరా.. బాగా ఆడు రీతూ ఓకేనా’ అంటూ రమ్య వీడ్కోలు చెప్పింది. గేటు దగ్గరికి వెళ్లే ముందు డీమాన్‌కి మరీ మరీ ‘జాగ్రత్త నువ్వు బాగా ఆడు, ఫ్యామిలీని గుర్తు తెచ్చుకో, నేను సపోర్ట్ చేస్తా బయటికెళ్లాక’ అని చెప్పి వెళ్లిపోయింది.

రమ్య మోక్ష ఫేర్వెల్ టాస్క్- ఐదుగుర్ని చెత్తబుట్టలో..స్టేజ్ మీదకు రాగానే ‘ఎలా ఉన్నావ్ రమ్య.. డిజప్పాయింట్ అయ్యావా’ అని నాగార్జున అడగగా, ‘లేదు సార్. నేను ఫిక్స్ అయ్యే వచ్చాను ప్రతి వారం నామినేషన్స్‌లో ఉంటానని.. కానీ ఇంత త్వరగా వెళ్తానని అనుకోలేదు. నాకు దేనికైనా హ్యాపీ సార్.. ఎక్కువ అత్యాశ లేదు, ఉన్నదాంతో తృప్తిగా ఉంటాను’ అని రమ్య నవ్వుతూ చెప్పింది. ఆమె జర్నీ వీడియో ప్లే చేసిన తర్వాత, నాగ్ రమ్యతో ‘నీకు ఏజ్ తక్కువే.. పట్టమని 25 ఏళ్లు కూడా లేవు.. కనుక నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది’ అంటూ ఆశీర్వదించారు.
తర్వాత రమ్యతో ఫేర్వెల్ టాస్క్ చేయించారు. స్క్రీన్ మీద ఉన్న 13 మంది కంటెస్టెంట్లలో ఐదుగురి ఫొటోల్ని పిక్ చేసి, చెత్త బుట్టలో వేయమని, దానికి కారణం చెప్పాలని నాగ్ అడిగారు.
ఫస్ట్ కళ్యాణ్ ఫొటోను డస్ట్‌బిన్‌లో వేస్తూ, ‘ఎందుకంటే తనకి మెచ్యూరిటీ లేదు.. నిబ్బానిబ్బీలా బిహేవ్ చేస్తుంటాడు. ఏదో మాట్లాడేస్తున్నా అనుకుంటాడు కానీ తనకి అంత మాట్లాడటం కూడా తెలీదు సార్. నామినేషన్స్ పాయింట్లో కూడా ఒకటి మాట్లాడదామనుకొని ఒకటి అయిపోతుంది’ అని రమ్య ఘాటుగా విమర్శించింది.
నెక్స్ట్ దివ్య ఫొటో వేస్తూ, ‘తను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి భరణి గారితోనే ఉండేవారు సార్.. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆమె బిహేవియర్ చాలా ఛేంజ్ అయింది. ఊరికే కొంచెం కోపం తెచ్చుకోవడం, అవసరం లేకుండా వాదించడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి. అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే బెటర్’ అని రమ్య చెప్పింది.
వెంటనే తనూజ ఫొటో కూడా డస్ట్‌బిన్‌లో వేస్తూ, ‘తనకి విషయం కంప్లీట్‌గా తెలీదు సార్.. తెలీకుండా వేరే ఎవరైనా చెప్తే అదే నిజం అనుకొని మాట్లాడేస్తుంది. మిస్ కమ్యూనికేషన్ వల్ల తను నన్ను అలా అర్థం చేసుకొని మేనిపులేటర్ అని అనుకొని ఉండొచ్చు అంతే’ అని రమ్య వివరణ ఇచ్చింది.
నెక్స్ట్ గౌరవ్ ఫొటో సెలక్ట్ చేస్తూ, ‘గౌరవ్ రాక్షసుడు సార్.. చెప్పిన మాట అసలు వినడు సార్.. ఏం చెప్పినా వినడు, తనదే ఫైనల్ డెసిషన్ అవ్వాలి అనుకుంటాడు. మాట్లాడటానికి కనీసం 5 సెకన్స్ కూడా గ్యాప్ ఇవ్వడు’ అని రమ్య చెప్పింది. గౌరవ్‌కి చాలా ఈగో ఉందని, ‘ఒకే టీమ్‌లో ఉన్నప్పుడు కూడా తన వల్లే గేమ్ గెలవాలి అనుకుంటాడు’ అంటూ విమర్శించింది.
చివరిగా పవన్ ఫొటో కూడా వేస్తూ, ‘నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను నీ గేమ్ నువ్వు ఆడు అని. ఎమోషనల్‌గా ఎక్కువ వెళ్లిపోకు, గేమ్ మీద ఫోకస్ చెయ్. బ్రెయిన్ వాడాలి కానీ బాగా ఎమోషనల్‌గా వెళ్లకూడదు సార్ కొన్ని కొన్ని పరిస్థితుల్లో.. ఓవర్ హెల్ప్ చేసేస్తాడు సార్’ అని చెప్పింది
ఇక చివరిగా ఇమ్మానుయేల్‌ను నాగ్ మాట్లాడమని అడగ్గా, ‘రమ్య స్క్రీన్‌లో అదిరిపోయావ్ రమ్య.. ఇలాగే నవ్వుతూ ఉండు.. మంచిగా ఎంజాయ్ చెయ్ బయట.. బాగా ఫుడ్ తిను.. బయటికొచ్చాక కలుద్దాం’ అని ఇమ్మూ అన్నాడు. ‘కానీ నా దురదృష్టం ఏంటో నా కోసం పంపించిన ఇద్దరినీ తీసుకెళ్లిపోయారు బిగ్‌బాస్(Bigg Boss).. అయేషా వెళ్లిపోయింది.. రమ్య కూడా వెళ్లిపోయింది.. కానీ ఏ మాటకి ఆ మాట మా దేవతలు కూడా మంచోళ్లు సార్’ అంటూ పొగిడేశాడు.
రమ్య వెళ్లిపోయే ముందు నాగార్జున ఆమె చేతికి ఒక బిగ్ బాంబ్‌ను ఇచ్చారు. ఆ బిగ్ బాంబ్ డ్యూటీ ఏంటంటే, హౌస్‌లో ఒకరికి వాష్‌రూమ్స్ క్లీనింగ్ డ్యూటీని వన్ వీక్ కోసం వేయాలి. దీనికి రమ్య వెంటనే రీతూ పేరు చెప్పింది. ‘నేను ఏం చేసినా నీ మంచి కోసమేరా’ అంటూ రమ్య రీతూకు ఈ పనిష్మెంట్ ఇచ్చింది.



