Just InternationalJust LifestyleLatest News

Countries:ఈ దేశాల్లోకి ఇండియన్స్‎కి ఫ్రీ ఎంట్రీ.. వీసా లేకుండా ప్రయాణించగలిగే ఐదు బ్యూటీఫుల్ ప్లేసెస్

Countries: భారత పౌరులకు భూటాన్ సందర్శించడానికి వీసా అవసరం లేదు, కేవలం ఓటరు కార్డు లేదా పాస్‌పోర్ట్ వంటి సరైన గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది.

Countries

చాలా మంది భారతీయులు వేరే దేశాన్ని సందర్శించాలని కలలు కంటారు. కానీ వీసా పొందడానికి కొంత సమయం ,కొన్ని కండిషన్లు ఉండటంతో చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే, అందమైన అలాగే వీసా అవసరం లేని (లేదా ఉచిత వీసా ఆన్ అరైవల్/e-Visa సౌకర్యం ఉన్న) దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కుటుంబ సెలవులు, ప్రేమ విహారయాత్రలు లేదా ఒంటరి ప్రయాణం విషయంలో అనువైన గమ్యస్థానాలు.

వీసా లేకుండా ప్రయాణించగలిగే ఐదు దేశాల(Countries)లో మొదటిది భూటాన్. ఇది హిమాలయాలలో ఉన్న అహింసా దేశం, పచ్చని లోయలు, స్వచ్ఛమైన గాలికి ప్రసిద్ధి చెందింది. భారత పౌరులకు భూటాన్ సందర్శించడానికి వీసా అవసరం లేదు, కేవలం ఓటరు కార్డు లేదా పాస్‌పోర్ట్ వంటి సరైన గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. భూటాన్ ప్రకృతి సౌందర్యానికి, సంస్కృతులకు, పురాతన మఠాలకు నిలయం. వీటిని మీరు ముఖ్యంగా పారో (టైగర్స్ నెస్ట్), థింఫు, పునాఖా వంటి ప్రదేశాలలో కనుగొనొచ్చు.

Countries-visa-free
Countries-visa-free

రెండవది, నేపాల్. ఇది భారతీయులకు అత్యంత దగ్గరగా ఉన్న, స్నేహపూర్వక దేశాలలో ఒకటి . వీసా లేకుండా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. భారతీయ పర్యాటకులు ఖాట్మండులోని చారిత్రక ప్రదేశాలు, పోఖారాలోని సహజ దృశ్యాలు, లుంబినీ (బుద్ధుని జన్మస్థలం) వంటివి సందర్శించవచ్చు. సాహస ప్రియులైతే ఎవరెస్ట్ శిఖరాన్ని సందర్శించడం లేదా పర్వతాలలో ఒక చిన్న ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. నేపాల్ దేశం(Countries) యొక్క ఆహార సంస్కృతితో పాటు భాష స్వదేశాన్ని పోలి ఉంటాయి.

Countries-visa-free
Countries-visa-free

మూడవ దేశం ఇండోనేషియా. ఇది అందమైన దీవుల సముదాయం, ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం బాలి. భారతీయులు ఇక్కడా వీసా అవసరం లేకుండా 30 రోజులు ఉండవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో బీచ్‌లు, దేవాలయాలు, అగ్నిపర్వతాలు సందర్శించవచ్చు. బాలి యోగా కేంద్రాలు, విశ్రాంతి కోసం బస చేయడానికి కూడా ప్రసిద్ధి. కాబట్టి ఇది జంటలు మరియు ఒంటరి ప్రయాణికులకు మంచి ఎంపిక.

Countries-visa-free
Countries-visa-free

తరువాత, మారిషస్. ఇది మరో ద్వీప స్వర్గం. భారతీయ పౌరులకు ఈ దేశంలో 90 రోజుల వీసా రహిత ప్రవేశం లభిస్తుంది. ఈ గమ్యస్థానం మృదువైన ఇసుక, స్వచ్ఛమైన నీరు, స్నేహపూర్వక ప్రజలతో నిండి ఉంటుంది. మారిషస్ హనీమూన్, కుటుంబంతో వెళ్ళడానికి అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ జలపాతాలు, టీ తోటలను సందర్శించొచ్చు, పడవ ప్రయాణాలను కూడా ఆస్వాదించొచ్చు. ఇక్కడ భారతీయ ఆహారం, సంస్కృతి కూడా లభిస్తాయి అలాగే అనేక హిందూ దేవాలయాలకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది.

Countries-visa-free
Countries-visa-free

చివరగా, జమైకా. ఇది కరేబియన్ రాష్ట్రం. బీచ్‌లు, రంగురంగుల సంస్కృతి , ఉల్లాసభరితమైన సంగీతానికి ప్రసిద్ధి. భారతీయ పర్యాటకులు 30 రోజుల వరకు వీసా లేకుండా జమైకాకు వెళ్లడానికి అనుమతించబడతారు. మీరు కొత్త అనుభవాన్ని కోరుకుంటే ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. జమైకా తాజా ఆహారం, సంగీత ఉత్సవాలు మరియు ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాలకు పర్యాటకులు ఆకర్షితులు అవుతారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button