Nitish Kumar Reddy :ఛాన్సులు అయిపోతున్నాయి.. నీకు అర్థమవుతోందా ?
Nitish Kumar Reddy :తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మర్చిపోతున్నాడంటున్నారు మాజీ క్రికెటర్లు..ఎందుకంటే వరుసగా ఛాన్సులు ఇస్తుంటే విఫలమవుతూ నిరాశ పరుస్తున్నాడు
Nitish Kumar Reddy
భారత్ క్రికెట్ జట్టులో ఎప్పుడూ వినిపించే మాట… టీమిండియాలో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం..పైగా ఒక్కో ప్లేస్ కూ కనీసం ముగ్గురు నలుగురు పోటీ ఉన్నప్పుడు ఇచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవాలి. వృథా చేసుకుంటే మాత్రం మళ్లీ మళ్లీ అవకాశాలు రావు. ఈ విషయాన్ని తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)మర్చిపోతున్నాడంటున్నారు మాజీ క్రికెటర్లు..ఎందుకంటే వరుసగా ఛాన్సులు ఇస్తుంటే విఫలమవుతూ నిరాశ పరుస్తున్నాడు.
గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ చేసి అదరగొట్టిన తర్వాత నితీష్‌పై భారీగానే అంచనాలు పెరిగాయి. జట్టులో ఆల్ ఫార్మాట్ ఆల్ రౌండర్ గా ఎదుగుతాడని అంచనా వేసారు. కానీ అంచనాలు అందుకోలేక వెనుకబడ్డాడు. మధ్యలో గాయం ఇబ్బంది పెట్టడం, తర్వాత జట్టులోకి వచ్చినా అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఆల్ రౌండర్ గా తన ప్లేస్ సుస్థిరం చేసుకుంటాడనీ అంతా అనుకున్నారు. తీరా చూస్తే వరుస అవకాశాలు ఇస్తున్నా నిలబెట్టుకోలేక పోతున్నాడు. దీంతో కొంతమంది మాజీ క్రికెటర్లు నితీష్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవకాశాలు ఇవ్వని సమయంలో ఎవరైతే అతనికి మద్దతుగా నిలిచారో వాళ్లే ఫైర్ అవుతున్నారు.

బ్యాటింగ్ పరంగానూ, బౌలింగ్ లోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేక పోతున్నాడు. గతంలో భారత్ బౌలింగ్ కోచ్ మోర్కెల్ నితీష్ ను పూర్తి స్థాయి బౌలింగ్ ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దుతాం అంటూ ప్రకటించాడు. కానీ ఆ తర్వాత నుంచీ అతనికి అనుకున్న స్థాయిలో బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడం ఆశ్చర్య పరిచింది.
అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. మళ్లీ ఆ తర్వాత అవకాశం ఇచ్చినా అతను నిలబెట్టుకోలేకపోతున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో రెండో వన్డేలో ఛాన్స్ దక్కింది. వాషింగ్టన్ సుందర్ గాయపడ్డంతో నితీష్ కు ప్లేస్ ఇచ్చారు. పైగా రెండో వన్డేలో జట్టును ఆదుకునే ఛాన్స్ కూడా వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు.
అసలే ఆల్ రౌండర్ గా పోటీ పెరుగుతున్న వేళ అద్భుతమైన అవకాశాలను వృథా చేసుకుంటున్నాడని మాజీలు మండిపడుతున్నారు. మూడో వన్డేలో కూడా నితీష్ కు మరో ఛాన్స్ దక్కుతుందని అంచనా. మరి ఈ అవకాశాన్ని అయినా ఈ తెలుగు క్రికెటర్ ఉపయోగించుకుంటాడో లేదో చూడాలి.
Speaker:తెలంగాణలో ఫిరాయింపుల మలుపు..స్పీకర్ తీర్పుతో మారిన సమీకరణాలు



