Just InternationalLatest News

Ukraine: ఫ్రాన్స్ తో 100 రఫేల్ ఫైటర్ జెట్స్ కు డీల్..  ఉక్రెయిన్ సంచలన నిర్ణయం

Ukraine: ఇప్పటికే విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు కొంటోన్న ఉక్రెయిన్ తాజాగా ఫ్రాన్స్‌తో భారీ ఒప్పందంచేసుకుంది.

Ukraine

రష్యా,ఉక్రెయిన్(Ukraine) మధ్య యుద్ధం వాతావరణం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రష్యా దాదాపు ఉక్రెయిన్ ను స్వాధీనం చేసేసుకోవచ్చు అనుకుంటున్న దశలో ఉక్రెయిన్(Ukraine) కూడా పోరాటపటిమ వదల్లేదు. ఈ క్రమంలో ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు కొంటోన్న ఉక్రెయిన్ తాజాగా ఫ్రాన్స్‌తో భారీ ఒప్పందంచేసుకుంది. ఏకంగా 100 రఫేల్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేసేందుకు డీల్ ఓకే అయింది. ఈ మేరకు ఫ్రాన్స్ ‌లో కీలక పత్రం మీద ఇరు దేశాధానేతలు సంతకాలు చేశారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా డీల్ కుదిరింది. ఈ అగ్రిమెంట్‎పై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌, ఉక్రెయిన్(Ukraine) ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సంతకాలు చేసిన వెంటనే ఇరు దేశాల దౌత్యకార్యాలయాల నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

Ukraine
Ukraine

రష్యా దాడుల తీవ్రమవుతుండడంతో తమ వైమానిక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఉక్రెయిన్ ఈ భారీ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. రష్యాతో యుద్దం మైదలైన తర్వాత జెలన్ స్కీ ఫ్రాన్స్‌లో తొమ్మిదో సారి పర్యటిస్తున్నారు. రఫెల్ జెట్స్ డీల్ కోసమే జెలెన్ స్కీ ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారని సమాచారం. అయితే ఒప్పందం విలువను మాత్రం ఇరు దేశాలు వెల్లడించలేదు. అలాగే ఎప్పుడు డెలివరీ చేసే వివరాలు కూడా తెలియజేయలేదు.

ఫ్రాన్స్‎కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ఈ రఫేల్ ఫైటర్ జెట్స్‌ను తయారు చేస్తోంది. ప్రపంచ రక్షణ రంగంలోనే రఫెల్ జెట్స్ అత్యంత క్రేజ్ ఉంది. వీటి శక్తి సామార్ధ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రఫేల్ రంగంలోకి దిగిందంటే.. ప్రత్యర్థులకు చుక్కలేదు. పహల్గాం ఉగ్ర దాడికి రివేంజ్ తీర్చుకునే క్రమంలో భారత్ రఫెల్ జెట్స్ తోనే దాయాది దేశం పాకిస్థాన్ భరతం పట్టింది.

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో రఫేల్ యుద్ధ విమానాలే పాక్ ఉగ్రస్థావరాలను నామరూపాలు లేకుండా చేశాయి. రఫెల్ దెబ్బకు బెంబేలెత్తిపోయిన పాక్ కాళ్ళబేరానికి వచ్చింది. రష్యాతో సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్.. ఇప్పుడు ఏకంగా 100 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంపై ఆసక్తికరంగా మారింది. వీటి ద్వారా రష్యాకు గట్టిగా సమాధానమివ్వాలని భావిస్తోంది. అయితే తొలి విడతగా ఎన్ని, ఎప్పుడు డెలివరీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button