Byju’s Ravindran: బైజూస్ రవీంద్రన్‌కు భారీ దెబ్బ.. అమెరికా కోర్టు సంచలన తీర్పు
Byju's Ravindran: బైజు రవీంద్రన్ కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించి, దాచిపెట్టారని కోర్టు నిర్ధారించింది.
Byju’s Ravindran
దేశీయ ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ (Byju’s) వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ( Byju’s Ravindran)ఇటీవల అమెరికా కోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫా , అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ (Glas Trust Company LLC) దాఖలు చేసిన పిటిషన్‌పై అమెరికా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో, డెలావేర్‌లోని దివాలా కోర్టు (Delaware Bankruptcy Court) ఎలాంటి వాదనలకు అవకాశం లేకుండా డిఫాల్ట్ జడ్జిమెంట్‌ను (Default Judgement) ప్రకటించింది.
బైజు రవీంద్రన్(Byju’s Ravindran) కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించి, దాచిపెట్టారని కోర్టు నిర్ధారించింది. పిటిషనర్‌కు నష్టపరిహారంగా 1.07 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,900 కోట్లకు పైగా) చెల్లించాలని కోర్టు రవీంద్రన్(Byju’s Ravindran)ను ఆదేశించింది.
ఈ కేసు విచారణకు హాజరు కావాలని రవీంద్రన్‌కు పలుమార్లు కోర్టు నోటీసులు పంపినా, ఆయన స్పందించకపోవడంతో ఈ డిఫాల్ట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.

వివాదానికి కారణం-బైజూస్ ఆల్ఫా నిధుల మళ్లింపు..నిజానికి, అంతర్జాతీయంగా నిధులను సమీకరించే లక్ష్యంతో బైజూస్ సంస్థ 2021లో బైజూస్ ఆల్ఫాను స్థాపించింది. బైజూస్ ఆల్ఫా ఈ ప్రయత్నంలో భాగంగా 1 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్-బిని (Term Loan-B) పొందింది.
లోన్ యొక్క నిబంధనలను బైజూస్ ఉల్లంఘించిందని, ఇందులో భాగంగా 533 మిలియన్ డాలర్లను అమెరికా నుంచి చట్టవిరుద్ధంగా తరలించారని రవీంద్రన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నిధులు ఎక్కడికి మళ్లించారనే దానిపైనే వివాదం నెలకొంది.
ఈ తీర్పుపై బైజు రవీంద్రన్ వెంటనే స్పందించారు. కోర్టు తీర్పును ఆయన ఖండించారు. అప్పీల్‌కు వెళ్తానని స్పష్టం చేశారు. ఆల్ఫా సంస్థ నుంచి తీసుకున్న నిధులను తాను వ్యక్తిగతంగా వాడుకోలేదని, మాతృసంస్థ అయిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (TLPL) యొక్క కార్యకలాపాల కోసమే ఖర్చు చేశామని రవీంద్రన్ పేర్కొన్నారు.
అమెరికా కోర్టు ఇచ్చిన ఈ భారీ తీర్పు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్ సంస్థకు మరింత క్లిష్టమైన పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ తీర్పుపై రవీంద్రన్ అప్పీల్‌కు వెళ్తే, కేసు మళ్లీ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.




One Comment