Talent:ట్యాలెంట్ ఉన్నా కొందరు ఎందుకు సక్సెస్ అవ్వరు? దానికి కారణం ఎవరో కాదు వారేనట..
Talent: చాలామంది లక్ లేదు, సిస్టమ్ తప్పు, అవకాశాలు రావట్లేదు అని అనుకుంటారు. కానీ సైకాలజీ మాత్రం ఒక వింత నిజం చెబుతుంది.
Talent
మన చుట్టూ ఒక సీన్ చాలా కామన్. చదువులో టాలెంట్ ఉంది, మాట్లాడటంలో స్కిల్ ఉంది, పనిలో క్రియేటివిటీ ఉంది… కానీ లైఫ్‌లో మాత్రం బ్రేక్ రావడం లేదు. అదే సమయంలో అంతగా ట్యాలెంట్(Talent) లేనివాళ్లు కూడా ముందుకు వెళ్తుంటారు. ఇది చూసి చాలామంది లక్ లేదు, సిస్టమ్ తప్పు, అవకాశాలు రావట్లేదు అని అనుకుంటారు. కానీ సైకాలజీ మాత్రం ఒక వింత నిజం చెబుతుంది. చాలా సార్లు మన ఎదుగుదలకు (Growth) అడ్డుగా నిలబడేది బయట వాళ్లు కాదు… మనమే.
దాన్నే సెల్ఫ్-సాబోటేజ్ (Self-Sabotage) అంటారు. సెల్ఫ్-సాబోటేజ్ అంటే మనం తెలిసీ తెలిసీ తప్పు చేయడం కాదు. తెలియకుండానే మన బ్రెయిన్ మన ఎదుగుదలకి బ్రేక్ వేయడం. ఉదాహరణకి ఒక అవకాశం వస్తుంది. కానీ ఇంకా రెడీ కాలేదు, ఇప్పుడేం తొందర అని మనమే దాన్ని వాయిదా (Postpone) వేస్తాం. ఒక(Talent) ఐడియా ఉంటుంది. కానీ ఇది వర్క్ అవ్వదు అని మొదటే కొట్టేస్తాం. ఇది మనల్ని రక్షిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి మనల్ని వెనక్కి లాగుతుంది.

మన బ్రెయిన్‌కు ఒక పెద్ద అలవాటు ఉంది. దానికి తెలియని దానికంటే తెలిసిన బాధే ఇష్టం. ఎందుకంటే తెలిసిన బాధలో సేఫ్టీ (Safety) ఉంటుంది. కొత్తగా ప్రయత్నిస్తే ఫెయిల్యూర్ (Failure) వస్తుందేమో, అవమానం అవుతుందేమో, విమర్శలు వస్తాయేమో అన్న భయం బ్రెయిన్‌ని అలర్ట్ చేస్తుంది. అప్పుడు బ్రెయిన్ ఒక ట్రిక్ ప్లే చేస్తుంది. ఇప్పుడేం అవసరం లేదు, ముందు ఇంకొంచెం నేర్చుకుందాం, ఇది మన లెవెల్ కాదు అని మనల్ని నెమ్మదిగా ఆపేస్తుంది. ఇది సోమరితనం కాదు. ఇది భయం.
చాలా మందికి బాల్యం నుంచే ఈ ప్రోగ్రామింగ్ (Programming) స్టార్ట్ అవుతుంది. నీ వల్ల కాదు, ఇది పెద్దవాళ్ల పని అన్న మాటలు మన బ్రెయిన్‌లో రూట్ (Root) అవుతాయి. పెద్దయ్యాక అవకాశం(Talent వచ్చినప్పుడు కూడా అదే వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు టాలెంట్ ఉన్నా మనం వెనక్కి అడుగు వేస్తాం. ఇంకో సెల్ఫ్-సాబోటేజ్ ప్యాటర్న్ పరిపూర్ణత (Perfectionism). పర్ఫెక్ట్‌గా అయ్యాకే స్టార్ట్ చేద్దాం అని అనుకోవడం. కానీ పర్ఫెక్ట్ అనే రోజు ఎప్పుడూ రాదు. ఈలోపు టైమ్ పోతుంది, ఛాన్స్ పోతుంది, నమ్మకం పోతుంది. చివరకు నా టైమ్ పోయింది అని మనమే అనుకుంటాం.
సైకాలజీ చెబుతున్న సింపుల్ నిజం ఏంటంటే— సక్సెస్ అనేది ముందుగా నమ్మకం కాదు, అడుగు. ముందు అడుగు వేస్తేనే నమ్మకం వస్తుంది. సెల్ఫ్-సాబోటేజ్ నుంచి బయటపడాలంటే పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. చిన్న అవేర్‌నెస్ (Awareness) చాలు. మనలో మనం ఇలా అడగాలి.. ఇది నిజంగా రిస్కా? లేక నా భయమా? మన బ్రెయిన్ భయపెడితే, మనమే మనకి ధైర్యం (Courage) చెప్పాలి. టాలెంట్ చాలామందికి ఉంటుంది. కానీ ఆ టాలెంట్‌ను బయటికి తీసే ధైర్యం కొందరికే ఉంటుంది. సక్సెస్ వాళ్లకి కాదు… Self-Sabotage ని గెలిచిన వాళ్లకి వస్తుంది.



