Just SpiritualJust Andhra PradeshLatest News

Devotees: తిరుమల భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్.. అలిపిరిలోనే అన్నప్రసాదం , బస

Devotees: భక్తులు అలిపిరిలో ప్రశాంతంగా బస చేసి, స్వామివారి దర్శనం ముగించుకుని నేరుగా తమ ఊర్లకు వెళ్లేలా ఈ టౌన్‌షిప్ నిర్మాణం జరగనుంది

Devotees

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల (Devotees)సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తిరుమలలో గదులు దొరకక, వసతి సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించిన టీటీడీ బోర్డు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

కొండపై స్థలాభావం ఉండటంతో, కొండ దిగువన ఉన్న అలిపిరి ప్రాంతాన్ని ఒక మెగా బేస్ క్యాంప్‌గా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం అలిపిరిలోని శిల్ప కళాశాలను మరో చోటుకు మార్చి, అక్కడ ఖాళీ అయ్యే 25 ఎకరాల స్థలంలో ఒక భారీ టౌన్‌షిప్‌ను నిర్మించబోతున్నారు.

ఈ టౌన్‌షిప్ అనేది మామూలు వసతి సముదాయం కాదు. విజన్ 2047 ప్రణాళికలో భాగంగా ప్రపంచ స్థాయి ఆర్కిటెక్టులతో దీనిని డిజైన్ చేయిస్తున్నారు. ఇందులో ఒకేసారి 20 వేల మంది భక్తులు బస చేసేలా గదులు , డార్మిటరీలను నిర్మిస్తారు. కేవలం నిద్రించడానికి గదులు మాత్రమే కాకుండా, భక్తులకు అవసరమైన అన్నప్రసాద కేంద్రాలు, టికెట్ కౌంటర్లు, లగేజ్ సెంటర్లు , యాత్రికుల సదుపాయ కేంద్రాలను (PAC) ఒకే చోట ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల భక్తులు తిరుమల కొండపైకి వెళ్లే ముందే అలిపిరిలోనే తమకు కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు.

Devotees
Devotees

ఈ ప్రాజెక్ట్ వెనుక మరో ముఖ్యమైన ఉద్దేశ్యం కాలుష్య నివారణ. భవిష్యత్తులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలను అలిపిరి వద్దే నిలిపివేయాలని టీటీడీ భావిస్తోంది. భక్తులు తమ కార్లను అలిపిరి పార్కింగ్ లో పెట్టి, టీటీడీ ఏర్పాటు చేసే ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది.

దీనివల్ల తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడమే కాకుండా, వాహనాల వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతుంది. నీరు మరియు విద్యుత్ వినియోగాన్ని కూడా దీనివల్ల సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. భక్తులు అలిపిరిలో ప్రశాంతంగా బస చేసి, స్వామివారి దర్శనం ముగించుకుని నేరుగా తమ ఊర్లకు వెళ్లేలా ఈ టౌన్‌షిప్ నిర్మాణం జరగనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button