Donald Trump: ట్రంప్ ఫోటోలు డిలీట్ ? ఎపిస్టీన్ సెక్స్ స్కామ్ లో ట్విస్టులు
Donald Trump: తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఫోటోలు డిలీట్ అయినట్టు వస్తున్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి.
Donald Trump
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు నిద్ర లేకుండా చేసిన ఫైనాఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్ సెక్స్ స్కామ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కామ్ లో భాగమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు తమ ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. దీని కోసం తెరవెనుక చాలా ప్రయత్నాలే చేస్తున్నారు.
తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఫోటోలు డిలీట్ అయినట్టు వస్తున్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ స్కామ్ లో ఉన్న ప్రముఖుల ఫోటోలను ఎప్‌స్టీన్ అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు విడుదల చేశారు. వీటిలో పలువురు ప్రముఖుల పాస్ పోర్టులు, ఇతర గుర్తింపు పత్రాలు, అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్ చేసిన కుంభకోణం ఎప్పుడో బయటకు వచ్చినా ఇటీవలే ఎక్కువ సంచలనమైంది.
తన పరమతి పెంచుకోడానికి దేశాధినేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలకు 18 ఏళ్లలోపు టీనేజ్ అమ్మాయిల్ని ఎరగా వేసినట్టు అతనిపై కేసు నమోదైంది. ఎపిస్టీన్ 2019లో జైల్లో ఉండగా సూసైడ్ చేసుకున్నాడు. అతడు చనిపోయినా ఈ కేసు ప్రకంపనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కుంభకోణంలో చాలా మంది ప్రముఖులు ఉన్నప్పుడు గతంలోనే తెలిసింది. తాజాగా డెమెక్రాట్లు రిలీజ్ చేసిన ఫోటోలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ లో చాలా వరకూ తొలగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఫోటోలను డిలీట్ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్ వర్గం కూడా స్పందించకపోగా ఆయన వ్యతిరేక వర్గం మాత్రం మరిన్ని ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఒత్తిడికి తలొగ్గే ట్రంప్ ఫోటోలు లేకుండా చేస్తున్నారని, దీనిపై పారదర్శకంగా విచారణ జరపాలని కోరుతున్నారు. ఎపిస్టీన్ ఫైల్స్‌లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సహా అమెరికా మాజీ మంత్రి ల్యారీ సమ్మర్స్, అమెరికాలో యూకే మాజీ రాయబారి మాండల్సన్, అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, న్యూమెక్సికో గవర్నర్ బిల్ రిచర్డ్‌సన్, అమెరికా సెనేట్ నేత జార్జ్ మిచెల్ ఉన్నారు.
వీరే కాదు ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరార్, ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, రైడ్ హఫ్‌మన్, పీటర్ థెయిల్ తదితరులు ఉన్నారు. వీరందరి ఫోటోలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సమయంలో ట్రంప్ ఫోటోలు మాత్రం డిలీట్ చేసారని ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యున్నత స్థాయి విచారణ జరపాలని డెమెక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.



