Just Spiritual

Sita temple:రాముడు లేని సీతాదేవి ఆలయం..

Sita temple :సాధారణంగా సీతమ్మను శ్రీరాముడితో కలిసే దర్శించుకుంటాం. కానీ, అవని క్షేత్రంలో మాత్రం సీతాదేవి(Sita Devi) ఒంటరిగా దర్శనమిస్తుంది

Sita temple:మన చిన్నతనం నుంచి రామాయణం ఓ భాగం. సీతారాముల పెళ్లి, 14 ఏళ్ల వనవాసం, పట్టాభిషేకం, సీతను రాముడు అడవులకు పంపడం, వాల్మీకి ఆశ్రమంలో లవకుశల జననం, తండ్రీకొడుకుల యుద్ధం, సీతమ్మ భూమిలో కలవడం… ఈ కథలన్నీ మనకు తెలిసినవే. భారతీయ సాహిత్యంలో ఆదికావ్యంగా రామాయణాన్ని, దాని రచయిత వాల్మీకిని ఆది కవిగా కీర్తిస్తారు. భారతదేశంలో సీతారాములు కొలువైన ఎన్నో ప్రదేశాలు ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి చాలామందికి తెలియదు. అదే కర్ణాటకలోని అవని క్షేత్రం(Avani Kshetra)!

సీతమ్మకు అంకితమైన ఏకైక ఆలయం ఇదే..

Sita temple :సాధారణంగా సీతమ్మను శ్రీరాముడితో కలిసే దర్శించుకుంటాం. కానీ, అవని క్షేత్రంలో మాత్రం సీతాదేవి(Sita Devi) ఒంటరిగా దర్శనమిస్తుంది. ఇది సీతమ్మకు మాత్రమే అంకితం చేసిన ఒక ప్రత్యేకమైన ఆలయం. ఈ క్షేత్రంలో రామలింగేశ్వర, లక్ష్మణేశ్వర, భరతేశ్వర, శత్రుఘ్నేశ్వర ఆలయాలు కూడా ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. బెంగళూరు(Bangalore)కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో, కర్ణాటకలోని కోలారు జిల్లా, ముల్‌బాగల్ తాలూకాలో ఈ ప్రసిద్ధ అవని క్షేత్రం ఉంది.

పురాణాల ప్రకారం, రామాయణం రచించిన వాల్మీకి మహర్షి రామాయణ కాలంలో ఇక్కడే నివసించారని చెబుతారు. సీతాదేవి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా ఈ అవని ప్రాంతంలోని ముని ఆశ్రమంలోనే నివసించిందట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సీతాదేవి ఇక్కడే లవకుశులకు జన్మనిచ్చిన గది నేటికీ చెక్కుచెదరకుండా ఉందని చెబుతారు. రామలక్ష్మణులకు, వారి కుమారులైన లవకుశలకు మధ్య యుద్ధం జరిగింది కూడా ఈ ప్రాంతంలోనే అని స్థలపురాణం చెబుతోంది.

యుద్ధం ముగిసిన తర్వాత, తమ తప్పును తెలుసుకున్న రామలక్ష్మణులు వాల్మీకి మహర్షిని ప్రాయశ్చిత్త మార్గం చెప్పమని కోరారట. అప్పుడు వాల్మీకి మహర్షి అక్కడే శివలింగాన్ని ప్రతిష్టించమని సూచించారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు వంటి వారందరూ కలిసి శివలింగాలను ప్రతిష్టించారట. కాలక్రమేణా, పంచపాండువులు, ఆదిశంకరాచార్యుల వంటి మహనీయులు కూడా ఇక్కడ శివలింగాలను ప్రతిష్టించడంతో, ఇప్పుడు ఈ క్షేత్రంలో మొత్తం 101 శివలింగాలు ఉన్నాయి.

అవని ప్రాంతంలో సీతమ్మ ప్రతిరోజూ పార్వతీదేవిని పూజించేదని ప్రతీతి. అందుకే ఇక్కడ అమ్మవారిని సీతా పార్వతీ మాత అని కూడా పిలుస్తారు. అవని కొండపైన పార్వతీదేవి సాలగ్రామ విగ్రహం కూడా ఉంది. లక్ష్మణుడు సీతమ్మ దప్పిక తీర్చడానికి బాణం వేయడంతో, బాణం ఆకారంలో ఒక మడుగు ఏర్పడిందని, దానిని లక్ష్మణ తీర్థం అని పిలుస్తారని చెబుతారు. మండుటెండల్లో కూడా ఈ మడుగులోని నీరు ఇంకిపోదని ఇక్కడి స్థానికుల నమ్మకం.

ఈ ఆలయానికి మరో విశేషమైన మహిమ ఉంది. సంతానం లేని దంపతులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా, సంతానం లేని స్త్రీలు లక్ష్మణ తీర్థంలో స్నానం చేసి, తడి బట్టలతోనే ఆలయంలో పూజలు చేస్తే వారి కోరికలు తీరుతాయని నమ్మకం. సంతానం కోసం ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు ఒక రాత్రి అక్కడ నిద్ర చేయడం ఆచారంగా వస్తోంది.

అవని క్షేత్రం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, రామాయణ కాలం నాటి ఎన్నో కథలకు, నమ్మకాలకు నెలవు. ఈ ప్రాంతం సందర్శకులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

Sita temple without Rama, Sitamma ,Avani Kshetra ,Avani Kshetra 100 km away from Bangalore, Kolaru District, Karnataka State.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button