Triphala powder :త్రిఫల చూర్ణం ఎన్ని రోగాలకు దివ్యౌషధమో తెలుసా?
Triphala powder : మార్కెట్లో విత్తనాలతో సహా చేసిన త్రిఫల చూర్ణం దొరుకుతుంది. అందుకే మనం ఇంట్లోనే విత్తనాలు తీసేసి శుభ్రం చేసి తయారు చేసుకుంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది.
Triphala powder
ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ‘త్రిఫల చూర్ణం’ (Triphala Powder) ఒక అద్భుతమైన , తిరుగులేని ఔషధంగా పేరు గాంచింది. మనిషి ఆరోగ్యం అనేది శరీరంలోని వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల సమతుల్యతపై ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ మూడు దోషాలను సమం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో త్రిఫల చూర్ణం అగ్రస్థానంలో ఉంటుంది.
త్రిఫల (Triphala) అంటే మూడు ఫలాలు లేదా పండ్లు అని అర్థం. కరక్కాయ, తానికాయ . ఉసిరికాయల మిశ్రమాన్నే త్రిఫల చూర్ణం (Triphala Powder) అంటారు. ఈ మూడు కాయల లోపల ఉండే విత్తనాలను తీసేసి, కేవలం పై పెచ్చులను మాత్రమే పొడి చేసి వాడటం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా చెబుతారు. మార్కెట్లో విత్తనాలతో సహా చేసిన పొడి దొరుకుతుంది. అందుకే మనం ఇంట్లోనే విత్తనాలు తీసేసి శుభ్రం చేసి తయారు చేసుకుంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది.
ఈ చూర్ణం తయారీలో ఒక భాగం కరక్కాయ, రెండు భాగాలు తానికాయ , నాలుగు భాగాలు ఉసిరికాయ పొడి ఉండాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. జబ్బులు ఉన్నా లేకపోయినా, ఒక నెల రోజుల పాటు త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా వాడితే శరీరంలో వచ్చే మార్పులను చూసి మనకు మనమే ఆశ్చర్యపోతాము.
త్రిఫల చూర్ణానికి (Triphala Powder) శరీరంలోని అధిక వేడిని తగ్గించే అద్భుతమైన గుణం ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను శుద్ధి చేసి ఆకలిని పెంచుతుంది. నేటి కాలంలో చాలా మంది బాధపడే మలబద్ధకం సమస్యకు ఇది రామబాణంలా పనిచేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను (Toxins) బయటకు పంపి లివర్ , ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంటుంది. చర్మ సమస్యలను తగ్గించి ముఖానికి కాంతిని ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) విపరీతంగా పెంచుతుంది.

త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించే విధానం కూడా కష్టం కాదు. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా త్రిఫల చూర్ణం కలుపుకొని తాగాలి. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఇలాగే తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. కొంతమంది దీనిని తేనెతో లేదా నెయ్యితో కలిపి కూడా తీసుకుంటారు.
త్రిఫల చూర్ణం కేవలం ఒక ఔషధం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని. మన శరీరంలోని అంతర్గత అవయవాలను శుభ్రం చేసి, పునరుజ్జీవింపజేయడంలో దీనికి సాటి మరొకటి లేదంటారు. ఈ కాలంలో మనం తింటున్న కల్తీ ఆహారం, పెరుగుతున్న కాలుష్యం నుంచి మన శరీరాన్ని కాపాడుకోవాలంటే త్రిఫల చూర్ణాన్ని మన జీవనశైలిలో ఒక భాగంగా చేసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు మన పురాతన వైద్య విధానం మనకు అందించిన ఈ దివ్యౌషధాన్ని వాడుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చని అంటున్నారు.
Tata Harrier EV :టాటా హారియర్ EV- అదిరిపోయే ఫీచర్లు.. ఈ కారును కొనడం తెలివైన నిర్ణయమేనా?



