Rai Rai Rara:సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న రై రై రారా సాంగ్..
Rai Rai Rara: ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి పాట చార్ట్ బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు ..రై రై రారా(Rai Rai Rara) ఆ అంచనాలను మరింత పెంచేసింది.
Rai Rai Rara
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చేసింది. ఉప్పెన డైరక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా నుంచి సెకండ్ సింగిల్ .. రై రై రారా(Rai Rai Rara) రిలీజై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడమే కాకుండా, ఈ రై రై రారా(Rai Rai Rara) సాంగ్‌ను స్వయంగా పాడటం విశేషం. ముఖ్యంగా ఈ పాటలో రామ్ చరణ్ వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్పులు చూస్తుంటే, మెగాభిమానులకు చెర్రీ డెబ్యూ మూవీ చిరుత రోజులు గుర్తొస్తున్నాయి.
సాధారణంగా రెహమాన్ అంటేనే మెలోడీలకు పెట్టింది పేరు. పెద్ది కోసం రెహమాన్ ఒక అదిరిపోయే మాస్ అండ్ మోటివేషనల్ సాంగ్‌ను సిద్ధం చేశారు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం యూత్‌లో జోష్ నింపేలా ఉంది. పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా.. నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావ్..అంటూ సాగే లైన్లు ప్రతి ఒక్కరికీ ఇన్స్పిరేషన్ కలిగించేలా ఉన్నాయి. బతుకంటే ఒక ఆటని, ఆ ఆటలో గెలవాలంటే నీలో కసి ఉండాలంటూ సాగే ఈ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయిపోయింది.
ఈ సాంగ్‌లో రామ్ చరణ్ డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చరణ్ తనదైన మార్క్ గ్రేస్‌తో అదరగొట్టేశారు. ఆరడుగుల కటౌట్, మాస్ లుక్, ఆ గ్రేస్ ఫుల్ మూమెంట్స్ చూస్తుంటే పాత చిరుత.. చరణ్‌ని మరోసారి చూస్తున్నామా అన్నంతగా ఉంది.

ముఖ్యంగా గ్లింప్స్‌లో చూపించిన ఆ క్రికెట్ షాట్ వెనుక ఉన్న సీన్ ..ఈ సాంగ్‌లోనే ఉంది. బ్యాట్‌ను గాల్లోకి విసిరి, చేతులకు మట్టి రాసుకుని చరణ్ కొట్టే ఆ షాట్.. థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయమని అంటున్నారు మెగా ఫ్యాన్స్.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సమర్పిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, వందలాది మంది డాన్సర్ల మధ్య ఒక గ్రాండ్ సెట్లో రై రై రారా.. సాంగ్‌ను షూట్ చేశారు.
ఇప్పటికే రిలీజైన ..చికిరి చికిరి పాట చార్ట్ బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు ..రై రై రారా(Rai Rai Rara) ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఏప్రిల్ 30న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి.



