Just International

Indians : ఇతర దేశాలలో ఉన్న మన భారతీయులెంతమందో తెలుసా?

Indians : ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కల్చరల్, ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత ఉందో చెప్పాలంటే, అది మన భారతీయ వలస జనాభా చూస్తే అర్థమవుతుంది.

Indians: ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కల్చరల్, ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత ఉందో చెప్పాలంటే, అది మన భారతీయ వలస జనాభా చూస్తే అర్థమవుతుంది. 2024 మే నాటికి, దాదాపు 35.4 మిలియన్ల మంది ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్‌లో ఉంటున్నారు. ఈ నంబర్‌లో 15.85 మిలియన్లు నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIs) కాగా, 19.57 మిలియన్లు ఇండియన్ ఆరిజిన్‌కి చెందినవారు. స్టడీస్ కోసం, జాబ్స్ కోసం, బిజినెస్ పర్పస్‌ల కోసం… ఇండియన్స్ ఎక్కువ మంది ఫారిన్ కంట్రీస్‌కి వెళ్తున్నారు. ఇలా మైగ్రేట్ అయిన వారిలో కొందరు అక్కడే సెటిల్ అవుతుంటే, మరికొందరు స్వదేశానికి వచ్చిపోతున్నారు.

 Indians are in other countries?

ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ డేటా బేస్ చేసుకుని, ఎక్కువ మంది ఇండియన్స్ నివసిస్తున్న టాప్ 10 కంట్రీస్ చూద్దాం. అత్యధికంగా మన దేశస్తులు నివసిస్తున్న లిస్టులో టాప్ లో అమెరికా, తర్వాత యూఏఈ ఉన్నాయి.

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో 9,76,000 మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. స్కిల్స్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్ ద్వారా అట్రాక్ట్ అవుతున్నారు. మెల్‌బోర్న్, సిడ్నీలలో ఇండియన్ ట్రేడ్ అసోసియేషన్స్, దీపావళి సెలబ్రేషన్స్ కల్చరల్ ప్రెజెన్స్‌ను చాటుతాయి.

కువైట్: కువైట్‌లో 9,95,000 మంది ఇండియన్స్ ఉన్నారు, ఇది ఆ కంట్రీ పాపులేషన్‌లో 20% కంటే ఎక్కువ. ఆయిల్, కన్‌స్ట్రక్షన్, హెల్త్, హౌస్‌హోల్డ్ సెక్టార్స్‌లో ఇండియన్స్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

శ్రీలంక: శ్రీలంకలో 1.61 మిలియన్ల ఇండియన్స్ ఉన్నారు. వీరిలో తమిళ లేబరర్స్‌తో పాటు, మోడర్న్ ఐటీ, టూరిజం సెక్టార్స్‌లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఉన్నారు. తమిళ, సింహళ కల్చరల్ సిమిలారిటీ మైగ్రేషన్‌ను ఈజీ చేస్తుంది.

సౌత్ ఆఫ్రికా: సౌత్ ఆఫ్రికాలో 1.7 మిలియన్ల ఇండియన్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 19వ సెంచరీలో షుగర్ ప్లాంటేషన్స్‌కు వచ్చిన కూలీల డిసెండెంట్స్. మోడర్న్ మైగ్రెంట్స్‌లో డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. డర్బన్‌లో ఇండియన్ రిటైల్ బిజినెస్‌లు డామినేట్ చేస్తున్నాయి.
గ్లోబల్ ఇంపాక్ట్ కొనసాగుతోంది.

యునైటెడ్ కింగ్‌డమ్ (UK): యూకేలో 1.86 మిలియన్ల ఇండియన్ పాపులేషన్ ఉంది. ఇది 1950లలో లేబర్ షార్టేజెస్, 1970లలో ఫ్యామిలీ రీ-యూనియన్ వేవ్స్ నుంచి డెవలప్ అయ్యింది. లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్‌లలో ఇండియన్స్ చిన్న బిజినెస్‌లు, ఫైనాన్స్, మెడికల్ సెక్టార్స్‌లో సర్వీసెస్ అందిస్తున్నారు.

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో 2.46 మిలియన్ల ఇండియన్స్ ఉన్నారు. 2023–24లో అదనంగా 2 లక్షల మంది జాయిన్ అయ్యారు. కన్‌స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్స్‌లో పెరుగుతున్న డిమాండ్, 3 వేలకు పైగా ఇండియన్ ఫర్మ్స్ ఉండటం ఈ కంట్రీలో ఇండియన్స్ నంబర్‌ను పెంచుతోంది.

కెనడా: కెనడాలో 2.88 మిలియన్ల ఇండియన్స్ ఉంటున్నారు. టొరంటో, వాంకోవర్‌లోని పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు, బాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇండియన్ కల్చర్‌ను రిఫ్లెక్ట్ చేస్తాయి. కెనడా ఇమ్మిగ్రేషన్ పాలసీలు స్కిల్డ్ ఇండియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

మలేషియా: మలేషియాలో 2.91 మిలియన్ల ఇండియన్ పాపులేషన్ ఉంది, ఇది కంట్రీ ఓవరాల్ పాపులేషన్‌లో సుమారు 9% ఉంటుంది. 19వ సెంచరీలో బ్రిటిష్ కొలొనియల్ ఎరాలో షుగర్, రబ్బర్ ప్లాంటేషన్స్‌కు కూలీలుగా వచ్చిన ఇండియన్స్ ఈ పాపులేషన్‌కు రూట్. ఇప్పుడు వారు మంచి జాబ్స్ చేస్తూ, ఫ్యామిలీస్‌ను పోషిస్తున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE): యూఏఈలో 3.57 మిలియన్ల ఇండియన్స్ నివసిస్తున్నారు. హైయెస్ట్ ఎన్‌ఆర్‌ఐ పాపులేషన్‌తో ఇది సెకండ్ ప్లేస్‌లో ఉంది. కన్‌స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, ఫైనాన్స్ సెక్టార్స్‌లో టాక్స్-ఫ్రీ శాలరీస్ ఇండియన్ వర్కర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. దుబాయ్ లేబర్ ఫోర్స్‌లో 70% ఇండియన్సే ఉండటం, ఆ కంట్రీ ఎకానమీలో వారి కీలక రోల్‌ను చూపిస్తుంది.

యునైటెడ్ స్టేట్స్: యునైటెడ్ స్టేట్స్‌లో సుమారు 5.4 మిలియన్ల ఇండియన్ పాపులేషన్ ఉంటోంది. ఇది వరల్డ్‌లోనే హైయెస్ట్. టెక్, హెల్త్ సెక్టార్స్‌లో అపారమైన ఆపర్చునిటీస్, వరల్డ్-క్లాస్ యూనివర్సిటీలు, స్కిల్స్ బేస్ చేసుకున్న ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఇండియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. న్యూజెర్సీలోని ఎడిసన్, న్యూయార్క్‌లోని జాక్సన్ హైట్స్ వంటి ఏరియాలను ‘లిటిల్ ఇండియా’ అని పిలుస్తారు. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లు, కల్చరల్ సెంటర్లు చాలా ఉంటాయి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button