Just EntertainmentLatest News

Megastar:బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ ర్యాంపేజ్..బుక్‌మైషోలో చిరు సరికొత్త చరిత్ర గురించి తెలుసా?

Megastar: కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Megastar

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజయిన మన శంకర వరప్రసాద్ గారు (MSG) సినిమా కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 226 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ రిలీజయిన .. నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్కును దాటేయడం చిరంజీవి క్రేజ్‌కు నిదర్శనం అంటారు.

ముఖ్యంగా బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవగా, అత్యంత వేగంగా ఈ క్రెడిట్‌ను అందుకున్న తొలి రీజనల్ మూవీగా ‘MSG’ నిలిచింది. మెగాస్టార్ (Megastar)చిరంజీవి , విక్టరీ వెంకటేష్ ఒకే స్క్రీన్‌పై కనిపించడం.. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ , ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు.

సినిమా సక్సెస్ సందర్భంగా మూవీ టీమ్ ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 30-40 సంవత్సరాల నుంచి చిరంజీవి , వెంకటేష్ ఒకే ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ..ఇద్దరూ కలిసి పూర్తిస్థాయిలో నటించే ఛాన్స్ రాలేదు. ఈ మూవీ ద్వారా తమ ఫ్యాన్స్ కోరిక నెరవేరిందని ఇద్దరు హీరోలు సంతోషం వ్యక్తం చేశారు.

కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఒక జంట ఈ మూవీని చూసి తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ కలిసిపోయారనే వార్త.. మెగాస్టార్‌(Megastar)ను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయనే స్వయంగా చెప్పారు.

Megastar
Megastar

అలాగే హీరోయిన్ నయనతారను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవడం వెనుకున్న కథను దర్శకుడు అనిల్ రావిపూడి సరదాగా పంచుకున్నారు. మెగాస్టార్ క్యారెక్టర్‌ను గట్టిగా ప్రశ్నించగల పాత్రలో.. నయనతార అయితేనే బాగుంటుందని మేకర్స్ భావించారు. అయితే టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఒక దశలో మూవీ నుంచి తప్పుకోవాలని అనుకున్నప్పుడు, అనిల్ రావిపూడి చాలా తెలివిగా రెస్పాండ్ అయ్యారు. ‘దృశ్యం’ సినిమాలో జరిగినవి మనం మర్చిపోయినట్లే, ఈ కథ గురించి మనం మాట్లాడుకోలేదనే విషయాన్ని మర్చిపోదామని ఆమెతో చెప్పడంతో, నయన్ నవ్వుకుంటూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరిందట.

సినిమాలో అభినవ్ గొమఠం, శ్రీనివాస్ రెడ్డి , మాస్టర్ రేవంత్ తమ పాత్రలతో నవ్వులు పూయించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్, ముఖ్యంగా సాంగ్స్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి , సుస్మిత కొణిదెల అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంక్రాంతి సెలవులు పూర్తి అయినా కూడా, థియేటర్ల వద్ద రద్దీ తగ్గకపోవడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడం గ్యారంటీగా కనిపిస్తోంది. అందుకే టాలీవుడ్ చరిత్రలో మరో మర్చిపోలేని హిట్ గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

IND vs NZ : ఇండోర్ లో గెలిచేదెవరు ?..సిరీస్ డిసైడర్ కు భారత్, కివీస్ రెడీ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button