India:గ్లోబల్ టెక్ రేసులో భారత్ టాప్.. డావోస్‌లో భారత్‌కు ఐఎంఎఫ్ ప్రశంసలు
India:భారత్ ఇప్పుడు కేవలం ఐటీ సేవలు ఇచ్చే దేశం మాత్రమే కాదు, గ్లోబల్ ఏఐ హబ్ గా మారుతోందని ఈ చర్చల ద్వారా తేలింది
India
స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 సదస్సులో.. భారత్(India) తన సత్తా చాటుతోంది. ఐఎంఎఫ్ (IMF) అధిపతి క్రిస్టలినా జార్జియేవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని చూసి ఆశ్చర్యపోయారు.
మొదట చిన్న అపార్థం వల్ల భారత్ ను సెకండ్ టైర్ ఏఐ పవర్ గా అభివర్ణించిన ఆమె, తర్వాత తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI), ఐటీ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ , టెక్ ఎకో సిస్టమ్ అద్భుతమని ఆమె కొనియాడారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా భారత్ యొక్క ఏఐ వ్యూహాన్ని చాలా గట్టిగా వినిపించారు. స్టాన్‌ఫోర్డ్ డేటా ప్రకారం ఏఐ టాలెంట్ , సన్నద్ధతలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. చిప్స్, మోడల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి 5 లేయర్ల లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అందరి ముందు వివరించారు. ఐఎంఎఫ్ అధిపతి కూడా భారత్ (India)యొక్క ఏఐ టాలెంట్, అడాప్షన్ , స్టార్టప్‌ల వేగాన్ని అభినందించారు.

భారత్ ఇప్పుడు కేవలం ఐటీ సేవలు ఇచ్చే దేశం మాత్రమే కాదు, గ్లోబల్ ఏఐ హబ్ గా మారుతోందని ఈ చర్చల ద్వారా తేలింది. దీంతో మన దేశంలో ఉన్న ఏఐ టాలెంట్ వల్ల రాబోయే ఐదేళ్లలో 8% ఆర్థిక వృద్ధిని సాధించొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గ్లోబల్ టెక్ వేదికపై భారత్ సత్తా చాటడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.
Foreign:ఫారిన్ ట్రిప్ అంటే కాస్ట్లీ కాదు.. ఈ దేశాల్లో రాజులా గడిపేయెచ్చు



