Just InternationalLatest News

India,US :భారత్ ,అమెరికా వాణిజ్య చర్చలు.. చైనా ఆధిపత్యానికి చెక్ పెడుతూ ద్వైపాక్షిక ఒప్పందం దిశగా అడుగులు పడతాయా?

India,US : ఒకవైపు యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతూ, మరోవైపు వాషింగ్టన్ తో భారత్ సమాంతరంగా సంప్రదింపు లు జరపడం దౌత్యపరంగా కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు.

India,US

ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ తన ముద్రను మరింత ఎక్కువగా బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. భారత్ , అమెరికా(India,US ) మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిర్చుకోవడానికి జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి నమోదైనట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు.. త్వరలోనే ఒక సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతూ, మరోవైపు వాషింగ్టన్ తో భారత్ సమాంతరంగా సంప్రదింపు లు జరపడం దౌత్యపరంగా కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు. అమెరికా మార్కెట్ భారత ఎగుమతిదారులకు ఎంత ప్రాధాన్యత కలిగిందో, యూరోపియన్ యూనియన్ మార్కెట్ కూడా అంతే ముఖ్యం అని అధికారులు భావిస్తున్నారు. అందుకే రెండు వైపులా సమాన దృష్టితో వాణిజ్య వృద్ధిని కోరుకుంటున్నారు.

వచ్చే వారం విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్ పర్యటన ..ఈ ఒప్పందానికి మరింత ఊతమివ్వనుందని తెలుస్తోంది. అక్కడ ఆయన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో , ట్రంప్ పరిపాలనలోని ఇతర సీనియర్ అధికారులతో భేటీ అయ్యే అవకాశముంది. ఈ భేటీల్లో వాణిజ్య సుంకాలు, కీలక ఖనిజాల సరఫరా వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడం వల్ల చర్చల్లో కొంత స్తబ్దత ఏర్పడింది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలు, ఇమ్మిగ్రేషన్ విధానాలు చర్చలకు అడ్డంగా మారాయి. అయితే ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య సహకారం అవసరమని గుర్తించిన రెండు పక్షాలు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తున్నాయి.

India,US
India,US

మరోవైపు చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ (ఆర్‌సీఈపీ)లో చేరకూడదన్న భారత్ నిర్ణయం ఎప్పటిలాగే కొనసాగుతుందని తెలుస్తోంది. భారత ఎగుమతులు అమెరికాకు సుమారు 86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది.

ప్రస్తుత ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధారిత నియమ నిబంధనలు ఒత్తిడిలో ఉన్న సమయంలో, ఇలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు దేశ తయారీ రంగం , ఉద్యోగ అవకాశాల వృద్ధికి ఎంతో దోహదపడతాయి. అమెరికాతో ఈ ఒప్పందం కుదిరితే భారతదేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత ఎక్కువగా ఆదరణ లభిస్తుంది.

Gautam Gambhir : మెగాటోర్నీకి ముందు అవసరమా ?..బెడిసికొట్టిన గౌతమ్ గంభీర్ ప్రయోగాలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button