Just SportsLatest News

T20 World Cup : అన్నీ మూసుకుని ఆడండి..లేకుంటే రూ. 348 కోట్లు కట్టండి

T20 World Cup : బ్రాడ్ కాస్టర్లు పాక్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. ఐసీసీ రూల్స్ ప్రకారం తటస్థ వేదికగా భారత్ తో మ్యాచ్ ఆడితే ఆడాలని లేకుంటే రూ.348 కోట్ల పరిహారం కట్టాలని హెచ్చరించినట్టు సమాచారం.

T20 World Cup

టీ ట్వంటీ ప్రపంచకప్(T20 World Cup )కు ఇంకా 9 రోజులే టైముంది. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ జట్టు విషయంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. భారత్ కు వచ్చేందుకు బంగ్లా అంగీకరించకపోవడం, వేదిక మార్చేందుకు ఐసీసీ నో చెప్పడంతో బంగ్లాదేశ్ తప్పుకుంది. ఆ జట్టు ప్లేస్ లో స్కాట్లాండ్ కు అవకాశమిచ్చారు.

అయితే బంగ్లాదేశ్ వ్యవహారంలో సంబంధం లేకున్నా పాకిస్థాన్ ఎంత ఓవరాక్షన్ చేసిందో అందరూ చూశారు. ఇప్పుడు మరోసారి పాక్ క్రికెట్ బోర్డు అతి చేస్తోంది. భారత్ తో బహిష్కరించే ఆలోనలో ఉంది. ఈ మెగాటోర్నీకి జట్టును ప్రకటించినా పాల్గొనే అంశంపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామంటూ పీసీబీ చీఫ్ నఖ్వీ ట్విస్ట్ ఇచ్చాడు. తమ ప్రధానితో చర్చించాకే నిర్ణయం ప్రకటిస్తామన్నాడు. దీంతో భారత్ తో మ్యాచ్ ఒకటే బహిష్కరించాలా.. టోర్నీ నుంచి తప్పుకోవాలా అన్న డైలమాలో పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పాక్ బోర్డు ఓవరాక్షన్ గమనించిన ఐసీసీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. తాజాగా బ్రాడ్ కాస్టర్లు కూడా పాక్ క్రికెట్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తో మ్యాచ్ ఆడకుంటే భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న బ్రాడ్ కాస్టర్లు ఆ మొత్తాన్ని పాక్ బోర్డు నుంచే వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు బ్రాడ్ కాస్టర్లు పాక్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. ఐసీసీ రూల్స్ ప్రకారం తటస్థ వేదికగా భారత్ తో మ్యాచ్ ఆడితే ఆడాలని లేకుంటే రూ.348 కోట్ల పరిహారం కట్టాలని హెచ్చరించినట్టు సమాచారం.

T20 World Cup
T20 World Cup

ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో భారత్, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దయిన తర్వాత కేవలం ఆసియాకప్, వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో అది కూడా తటస్థ వేదికపై మాత్రమే ఆడుతున్నాయి. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అటు ఐసీసీ,ఇటు బ్రాడ్ కాస్టర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

దీనిలో భాగంగా బ్రాడ్ కాస్టర్లు భారత్, పాక్ మ్యాచ్ రోజు తమ అడ్వర్టైజ్ మెంట్ స్లాట్లను భారీ ధరకు విక్రయిస్తారు. అటు ఛానల్ వ్యూయర్ షిప్ కూడా భారీస్థాయిలో ఉంటుంది. ఇప్పుడు భారత్ తో మ్యాచ్ ను పాక్ బహిష్కరిస్తే బ్రాడ్ కాస్టర్లకు వచ్చే నష్టం దాదాపు రూ.348 కోట్లుగా అంచనా. పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసి మ్యాచ్ ఆడకుంటే ఈ మొత్తాన్ని ఐసీసీ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో కట్ చేసుకునేందుకు బ్రాడ్ కాస్టర్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Erra Matti Dibbalu:విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు.. భూమి పుట్టినప్పటి ఆనవాళ్లు

Related Articles

Back to top button