Just NationalLatest News

Job :టెన్త్ క్లాస్ మార్కులతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలంటే..

Job : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Job

మీరు పదో తరగతి పాసయ్యారా? ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా, ఇంటర్వ్యూ టెన్షన్ లేకుండా డైరక్టుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Job )సాధించాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇండియా పోస్ట్ అదిరిపోయే శుభవార్తను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంపికైన వారు తమ సొంత ఊరిలోనే ఉద్యోగం చేసే అద్భుతమైన అవకాశమిచ్చింది.

ఖాళీలు , పోస్టుల వివరాలు:-
మొత్తం 28,740 ఖాళీలలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతగుర్తింపు పొందిన బోర్డు నుంచి కేవలం పదో తరగతి పాసైన అభ్యర్థులు దీనికి అర్హులు.
సబ్జెక్టులు- టెన్త్ క్లాస్‌లో మ్యాథ్స్, ఇంగ్లీష్ , తెలుగు(లేదా వారి స్థానిక భాష) తప్పనిసరిగా చదివి ఉండాలి.
వయస్సు- అభ్యర్థుల వయసు 18- 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఇతర నైపుణ్యాలు- కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ లేదా బైక్ నడపడం వచ్చి ఉండాలి.ఎంపిక విధానంఎగ్జామ్ లేదు-ఈ నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే.. ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగా అలాగే ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. కేవలం మీ టెన్త్ మార్క్స్ లిస్టే మీ ఉద్యోగాన్ని నిర్ణయిస్తుంది.

జీతం వివరాలు

BPM (బీపీఎం).. నెలకు రూ. 12,000 నుంచి రూ. 29,380 వరకు.
ABPM/డాక్ సేవక్.. నెలకు రూ. 10,000 నుంచి రూ. 24,470 వరకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు- ఫీజు వివరాలు..

దరఖాస్తు గడువు.. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 14, 2026 రాత్రి 11:59 గంటలలోగా అప్లై చేసుకోవాలి.
ఫీజు.. జనరల్ అభ్యర్థులకు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అలాగే ట్రాన్స్ ఉమెన్స్‌కు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు సవరణ (Correction Window).. పొరబాట్లు సరిచేసుకోవడానికి ఫిబ్రవరి 18 , 19 తేదీల్లో అవకాశం ఉంటుంది.

Job
Job

సొంత ఊరిలో, గౌరవప్రదమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం(Job ) చేయాలనుకునే నిరుద్యోగులు ఈ అవకాశాన్నిఅస్సలు వదులుకోవద్దు. వెంటనే అప్లై చేసేసుకోండి!
లింక్ ఇక్కడ ఉంది – https://indiapostgdsonline.gov.in/

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button