Just Science and TechnologyLatest News

6G Technology : 6G టెక్నాలజీ మన జీవితాలను మార్చబోతోందా?

6G Technology : సెకనుకు 1 టెరా బైట్ (1 TBps) డేటాను డౌన్‌లోడ్ చేసే సామర్థ్యం 6G సొంతం .

6G Technology

మనం ఇప్పుడిప్పుడే 5G టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నాం, కానీ ప్రపంచంలోని చాలా దేశాలు అప్పుడే 6G వైపు అడుగులు వేసేస్తున్నాయి. 2030 నాటికి పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రానున్న 6G టెక్నాలజీ(6G Technology ) మన ఊహకందని మార్పులను తీసుకురాబోతోంది.

5G కంటే 6G సుమారు 100 రెట్లు వేగంగా పనిచేస్తుంది. సెకనుకు 1 టెరా బైట్ (1 TBps) డేటాను డౌన్‌లోడ్ చేసే సామర్థ్యం 6G సొంతం . అంటే మీరు ఒక హై-డెఫినిషన్ మూవీని.. ఇలా రెప్ప మూసి తెరిచే లోపు డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చన్న మాట.

అయితే 6G టెక్నాలజీ (6G Technology ) కేవలం స్పీడ్ కోసం మాత్రమే కాదు, ఇది ‘ఇంటర్నెట్ ఆఫ్ సెన్సెస్’ (Internet of Senses) అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మనం ఎక్కడో ఉన్న వస్తువును తాకినట్లుగా, స్మెల్ చూసినట్లుగా కూడా అనుభూతి చెందొచ్చు.

హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ ద్వారా మనకు దూరంగా ఉన్న వ్యక్తి మన పక్కనే కూర్చున్నట్లుగా త్రీ-డీ రూపంలో కనిపించే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , 6G కలిసి పనిచేయడం వల్ల డ్రైవర్ లేని కార్లు, రిమోట్ సర్జరీలు అత్యంత కచ్చితత్వంతో పని చేస్తాయి.

AI Genarated images
AI Genarated images

అంతేకాకుండాఅంతరిక్ష పరిశోధనలు, సముద్ర గర్భంలోని అన్వేషణలకు కూడా 6G కీలకం కాబోతోంది. స్మార్ట్ సిటీలలో ప్రతి వస్తువు కూడా ఇంటర్నెట్ తో అనుసంధానించబడి ఉంటుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గి, పర్యావరణానికి మంచి జరుగుతుంది.

టెక్నాలజీ అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది మనిషి జీవన ప్రమాణాలను పెంచే ఒక సాధనమని 6G నిరూపించబోతోంది. అయితే ఇండియా కూడా ఇప్పటికే 6G పరిశోధనల్లో ముందు వరుసలో ఉండటం అందరూ గర్వించతగ్గ విషయంగా మారుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button