Just EntertainmentLatest News

Jr NTR:స్టైలిష్ లుక్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ మాములుగా లేదుగా!

Jr NTR: మొన్నటి వరకు ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు అని కామెంట్లు చేసినవారే ఇప్పుడు స్టైలిస్ లుక్‌లో బాగున్నాడు అంటూ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.

Jr NTR

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అసలైన విందు దొరికినట్లు అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి చాలా కాలంగా అధికారిక వార్తలు లేకపోయినా, తాజాగా తారక్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. మొన్నటి వరకు ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు అని కామెంట్లు చేసినవారే ఇప్పుడు స్టైలిస్ లుక్‌లో బాగున్నాడు అంటూ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.

లేటెస్ట్ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్లిమ్‌గా, పర్ఫెక్ట్ షేప్‌లో కనిపిస్తున్నారు. గడ్డం, చెవికి రింగ్, కళ్లకు గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైలిష్‌గా నడుస్తూ వస్తున్న తారక్ లుక్ ఇప్పుడు.. సోషల్ మీడియాను ఊపేస్తోంది. బ్లూ జీన్స్, హుడీ ధరించి ఎంతో సింపుల్‌గా ఉన్నా, ఆయన లుక్ చూస్తుంటే డ్రాగన్ సినిమాలో తారక్ విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ప్రొడ్యూసర్ రవిశంకర్ కూడా ఉండటంతో, సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ కోసమే ఆయన వెళ్తున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోర్డాన్ దేశానికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. అక్కడ అత్యంత కీలకమైన , భారీ యాక్షన్ సన్నివేశాలను ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారట. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ప్రశాంత నీల్ గత సినిమాలు కేజీఎఫ్, సలార్ లాగా డార్క్ షేడ్ అంటే బ్లాక్ అండ్ గ్రే లో కాకుండా, ఎన్టీఆర్ సినిమాను చాలా కలర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది తారక్ అభిమానులకు ఒక కొత్త ఫీల్ ఇవ్వడం ఖాయం.

Jr NTR
Jr NTR

మొదట ఈ సినిమాను జూన్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ వేగం చూస్తుంటే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు , విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కు ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. పర్ఫెక్ట్ ఔట్‌పుట్ ఇవ్వడం కోసం మేకర్స్ ఎక్కడా కూడా రాజీ పడకూడదని భావిస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నా, ఇప్పటికైతే అదే డేట్ టార్గెట్‌గా షూటింగ్ కంటెన్యూ అవుతోంది.

మరో వైపు ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తుండగా.. మలయాళ నటుడు టొవినో థామస్ కూడా ఈ మూవీలో భాగం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి. మొత్తానికి తారక్ ఏంటి ఇలా అయిపోయాడని బాధపడిన ఫ్యాన్స్‌కు, ఈ నయా లుక్ ఫుల్ ఎనర్జీని ఇచ్చినట్లే అయింది

 

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button