Just InternationalHealthJust LifestyleLatest News

Chinese Intelligence :ఆశ్చర్యపరుస్తున్న చైనా మెగా ప్రాజెక్టులు.. చైనీయులకున్న తెలివితేటలు మిగిలిన దేశాలకు ఎందుకు లేవు?

Chinese Intelligence :  చైనా ఆధిపత్యం, చైనీయుల తెలివితేటలు అనేవి కేవలం అదృష్టమో లేక డబ్బు వల్లో వచ్చినవి కాదు.

Chinese Intelligence

ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలనున్నా సరే.. అక్కడ అద్భుతమైన వస్తువు చూసినా, ఏ మెగా ప్రాజెక్టు గురించి విన్నా కూడా దాని వెనుక చైనా పేరే వినిపిస్తోంది. తాజాగా ప్రారంభమైన 24 కిలోమీటర్ల షెన్‌జెన్-జోంగ్‌షాన్ సముద్ర కారిడార్ చైనా పనితనానికి నిలువెత్తు నిదర్శనం. సముద్రం కింద టన్నెల్, కృత్రిమ దీవులు, భారీ వంతెనల కలయికతో రూపొందిన ఈ భారీ ప్రాజెక్టును చూసి ప్రపంచ దేశాలన్నీ నోరెళ్లబెడుతున్నాయి.

దీంతో చైనా ఎందుకు ఎప్పుడూ అందరికంటే ముందుంటోంది? వారిలో ఉన్న ఆ ప్రత్యేకమైన తెలివితేటలు(Chinese Intelligence ), శాస్త్రీయ ఆధిపత్యం వెనుక ఉన్న కారణాలేంటన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది. చివరకు దీనికి 5 కారణాలు ఉన్నాయని పరిశోధనలలో తేలింది.

1. చాలా అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం, తూర్పు ఆసియా దేశాల ముఖ్యంగా చైనీయుల సగటు ఐక్యూ (IQ) సుమారు 105 గా ఉంది, ఇది ప్రపంచ సగటు (100) కంటే ఎక్కువ. దీనికి కోల్డ్ వింటర్ థియరీ అనే ఒక శాస్త్రీయ కారణం ఉందని పరిశోధకులు చెబుతుంటారు.

వేల ఏళ్ల క్రితం చైనాలోని కఠినమైన చలి వాతావరణంలో అక్కడి వారంతా బ్రతకడానికి వారు నిరంతరం కొత్త దారులు వెతకాల్సి వచ్చేది. ఇలా వారి మెదడులో ‘ప్రాబ్లమ్ సాల్వింగ్’ అంటే సమస్య పరిష్కార సామర్థ్యం జన్యుపరంగా పెరిగిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

2. చైనాలో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ చాలా స్ట్రిక్టుగా ఉంటుంది. ‘గావోకావో’ అనే ఎంట్రన్స్ టెస్ట్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ఏటా కోటి మందికి పైగా విద్యార్థులు రాసే ఈ ఎగ్జామ్‌లో కేవలం అత్యుత్తమ మేధావులను మాత్రమే ఎంపిక చేస్తారు.

చైనా విద్యావ్యవస్థ మెయిన్‌గా స్టెమ్ (STEM) అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ పైనే ఫోకస్ చేస్తుంది. అమెరికా ఏటా 8 లక్షల మందిని గ్రాడ్యుయేట్లు చేస్తుంటే, చైనా ఏకంగా 1.2 కోట్ల మంది నిష్ణాతులను తయారు చేస్తోంది. అంటే అక్కడ మేధావుల ‘మాస్ ప్రొడక్షన్’ అక్కడ జరుగుతోంది.

3. చైనా విజయం వెనుక ఉన్న మరో సీక్రెట్ వారి వర్క్ కల్చర్. దీనిని ‘996’ అని అక్కడి వారు పిలుస్తారు. అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు పనిచేస్తూనే ఉంటారు.

మన దేశంలో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ ఎనిమిది గంటల పనికే అమ్మో అలసిపోయాం అంటాం. కానీ చైనీయులు క్రమశిక్షణతో కూడిన హార్డ్ వర్క్ ను ఒక తమ జీవితంలో భాగంగా భావిస్తారు. ఈ అంకితభావమే అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను కూడా సుసాధ్యం చేస్తోంది.

4. మిగిలిన దేశాల్లో ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ దేశంలో పాలసీలు కూడా మారుతుంటాయి. కానీ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ పాలన వల్ల వారు 20 ఏళ్ల తర్వాత దేశం ఎలా ఉండాలో ఇప్పుడే ప్లాన్ చేసి రెడీగా పెట్టుకుంటారు.

ఇప్పటికే మేడ్ ఇన్ చైనా 2025 , ‘థౌజండ్ టాలెంట్స్ ప్లాన్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను ఆకర్షించి, ఆవిష్కరణలకు (R&D) ఏటా వందల బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. పేటెంట్ల విషయంలో కూడా ఇప్పుడు చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.

5. చైనాకు ఉన్న మరో అతిపెద్ద బలం జనాభా. ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలుపెడితే కనుక, లక్షలాది మంది కార్మికులను, వేల మంది ఇంజినీర్లను ఒక్కసారిగా మొబిలైజ్ చేయగల సామర్థ్యం చైనా వారికి ఉంది. షెన్-జోంగ్ లింక్ కోసం ఏకకాలంలో లక్ష మంది పనిచేయడంతోనే వారి వ్యవస్థలోని వేగాన్ని అర్ధం చేసుకోవచ్చు.

Chinese Intelligence
Chinese Intelligence

చైనా ఆధిపత్యం, చైనీయుల తెలివితేటలు(Chinese Intelligence ) అనేవి కేవలం అదృష్టమో లేక డబ్బు వల్లో వచ్చినవి కాదు. అది జన్యుపరమైన తెలివితేటలు, కఠినమైన శిక్షణ, క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ పట్టుదలల కలయిక అని చెప్పుకోవాలి.

భారతదేశం కూడా తన ఐక్యూ గ్యాప్‌ను తగ్గించుకుంటూ, విద్యా వ్యవస్థలో పరిశోధనలకు పెద్దపీట వేస్తే, భవిష్యత్తులో భారతీయులు కూడా ఇటువంటి మెగా అద్భుతాలను సృష్టించొచ్చు. ఎందుకంటే చైనా అందరికీ ఒక అజెండా కాదు, అది ఒక పాఠం కావాలన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మన దేశం నుంచి కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు చైనీయుల తెలివితేటలు(Chinese Intelligence ) పోటీ పడే స్థాయిలో ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button