Just SportsLatest News

Pakistan:పాకిస్థాన్‌కు ఐసీసీ 24 గంటల డెడ్‌లైన్..కాదనుకుంటుందా? కాళ్ల బేరానికి వస్తుందా?

Pakistan: భారత్‌తో మ్యాచ్ ఆడటానికి సిద్ధమని చెబుతూనే, మూడు వింతైన డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది పాక్ బోర్డ్.

Pakistan

ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్ , పాకిస్థాన్( Pakistan) మ్యాచ్‌పై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయి. భారత్‌తో ఆడటానికి మేం రెడీ.. కానీ 3 కండిషన్లు అంటూ మరో మెలికతో ముందుకు వచ్చింది పాకిస్టాన్ క్రికెట్ టీమ్.

భద్రతా కారణాల వల్ల భారత్‌లో ఆడడానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌కు మద్దతుగా, తాము కూడా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఐసీసీ ప్రతినిధులు ఆదివారం లాహోర్‌లో పీసీబీ అధికారులతో సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ భేటీలో పాక్ బోర్డు.. భారత్‌తో మ్యాచ్ ఆడటానికి సిద్ధమని చెబుతూనే, మూడు వింతైన డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. మొదటిది, ఐసీసీ నుంచి ప్రతి ఏటా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే వార్షిక నిధుల వాటాను భారీగా పెంచాలని, రెండోది, ప్రస్తుత మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్నా, ఆ దేశానికి అందాల్సిన పార్టిసిపేషన్ ఫీజును పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇక మూడోది, భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్లకు బంగ్లాదేశ్‌కు ఆతిథ్య హక్కులు కల్పించాలని కోరింది.

పాకిస్థాన్( Pakistan) పెట్టిన ఈ డిమాండ్లపై ఐసీసీ తీవ్రంగా రియాక్టయింది. అనవసరమైన కారణాలతో మ్యాచ్‌లను బహిష్కరించడం వల్ల టోర్నీకి , క్రికెట్ ప్రతిష్టకు భారీ నష్టం వాటిల్లుతుందని వార్నింగ్ ఇచ్చింది. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే వచ్చే వందల కోట్ల ఆదాయం నష్టపోవడమే కాకుండా, స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఐసీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

దీంతో పాకిస్థాన్‌కు ఐసీసీ 24 గంటల డెడ్‌లైన్ విధించింది. తమ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని, ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్‌కు దక్కాల్సిన వార్షిక నిధుల్లో భారీ కోత విధించడంతో పాటు, భారీ జరిమానాలతో పాటు సభ్యత్వం రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఐసీసీ విధించిన ఈ అల్టిమేటంపై చర్చించడానికి పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం తన దేశ ప్రధానితో సమావేశం కానున్నారు.

Pakistan
Pakistan

పాక్ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల బట్టే పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడుతుందా లేదా అనేది తేలబోతోంది. మరోవైపు బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఐసీసీ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము సిద్ధమేనని క్లారిటీ ఇచ్చింది బంతి ఇప్పుడు పాకిస్థాన్ కోర్టులో ఉండటంతో వారి నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

నిజానికి ఇదంతా బంగ్లాదేశ్ మీద ఉన్న ప్రేమేనా లేక వేరే కుట్ర ఉందా అన్న కొత్త సందేహాలు తలెత్తుతున్నా వాదన వినిపిస్తోంది. పాకిస్థాన్ వేస్తున్న ఈ ఎత్తుగడలు చూస్తున్నవారంతా.. కేవలం ఐసీసీని ఇబ్బంది పెట్టడానికే అన్నది అర్థమవుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి ఐసీసీ 24గంటల డెడ్ లైన్ ను కూడా కాదనుకుంటుందా? కాళ్ల బేరానికి వస్తుందా అనేది మరి కాసేపట్లో తేలిపోనుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button