Just LifestyleHealthLatest News

Plan B :ప్లాన్ ఏ ఓకే.. కానీ ప్లాన్ బీ మీ విజయానికి శత్రువట.. సైకాలజీ అదే చెబుతోంది..

Plan B: వెనక్కి వెళ్లే దారి లేనప్పుడు మాత్రమే మనిషి తనలోని అసలైన శక్తిని బయటకు తీస్తాడట.

Plan B

జీవితంలో ఏదైనా పెద్ద టార్గెట్‌ను చేరుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, మనకు తెలియకుండానే మనం చేసే అతిపెద్ద తప్పు ఒకటి ఉంటుంది. అదేంటంటే ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే తర్వాత ఉపయోగపడేలా ప్లాన్ బీ (Plan B) ని సిద్ధం చేసుకుంటాం. మొదటిది విఫలమైతే మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండో మార్గం అవసరమని మనం అనుకుంటాం.

దీనిని మనం ముందుచూపు లేదా జాగ్రత్త అని అనుకుంటాం. కానీ సైకాలజీ ప్రకారం, మన మెదడు ఎప్పుడూ తక్కువ శక్తిని ఖర్చు చేసే దారినే ఎంచుకుంటుందట. ఎప్పుడైతే ఒకవేళ ఈ పని కాకపోతే తనకు మరో దారి ఉంది కదా అనే ఒక భరోసా మెదడుకు దొరుకుతుందో, అప్పుడు మొదటి ప్లాన్ కోసం పెట్టాల్సిన కసి, పట్టుదల సగానిక సగం పడిపోతాయట.

పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో.. ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఎలా అంటే తమ దగ్గర ప్రత్యామ్నాయ మార్గం ఎలాగూ ఉందని తెలిసిన వ్యక్తులు, మొదటి పనిలో చూపించే ఏకాగ్రతలోనూ పట్టుదలలోనూ వెనుకబడ్డారని తేలింది.

Plan B:
Plan B:

దీనినే సైకాలజీ భాషలో మోటివేషనల్ క్రాష్ అని పిలుస్తారు. అంటే వెనక్కి వెళ్లే దారి లేనప్పుడు మాత్రమే మనిషి ..తనలోని అసలైన శక్తిని బయటకు తీస్తాడన్న మాట. ప్రాచీన కాలంలో యుద్ధవీరులు సముద్రం దాటి శత్రువుల మీదకు వెళ్తున్నప్పుడు, వారు వచ్చిన ఓడలను వారే తగలబెట్టుకునేవారట. ఎందుకంటే, ఇక వెనక్కి వెళ్లే అవకాశం లేదని తెలిస్తేనే వారంతా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతామని వారికి తెలుసు కాబట్టి.

మనిషి మెదడు ఇలాగే ఆలోచిస్తుందట. అది మనిషి గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడే అద్భుతమైన ఐడియాలను ఇస్తుంది.అదే ప్లాన్-బి అనేది మన మైండ్‌లో ఉండటం వల్ల మనం రిస్క్ తీసుకోవడానికి భయపడతాం అలాగే త్వరగా వెనక్కి తగ్గిపోతాం.

కాబట్టి, మీ లక్ష్యం పట్ల మీకు పూర్తి నమ్మకం ఉంటే, ప్లాన్ బీ( Plan B)ని పక్కన పెట్టి ప్లాన్-ఏ కోసమే సర్వశక్తులు ఒడ్డాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. విజయం సాధించిన వారు, సాధించాలని బయలుదేరినవారు ఎప్పుడూ ఒకే పడవ మీద ప్రయాణం చేస్తారు తప్ప, రెండు పడవల మీద కాళ్లు వేసి ప్రయాణం చేయరు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button