Just BusinessLatest News

Gold price:తగ్గిన బంగారం ధరలు.. పసిడి ధరలు ఇలా దిగిరావడానికి కారణమేంటి?

Gold price: వెండిపై పెట్టుబడి పెట్టే కంటే బంగారంపైనే మేలని ఇన్వెస్టర్లు భావించడం కూడా మార్కెట్ ట్రెండ్‌ను మారుస్తోంది.

Gold price

భారతీయులకు ఎప్పుడూ కూడా బంగారం అంటే ఒక ఆర్నమెంట్ కాదు, అదొక సెంటిమెంట్. అంతకుమించి ఒక సురక్షితమైన పెట్టుబడి. కొన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు(Gold price), ఈ మధ్య సామాన్యులకు కాస్త ఊరటనిస్తున్నాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు, డాలర్ విలువలో మార్పులు, అమెరికా ఆర్థిక నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో ధరలు చుక్కలను తాకాయి.అంతేకాదు చైనా వంటి దేశాలు భారీగా బంగారాన్ని నిల్వ చేయడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అయితే మెల్లగా వెండిపై పెట్టుబడి పెట్టే కంటే బంగారంపైనే మేలని ఇన్వెస్టర్లు భావించడం కూడా మార్కెట్ ట్రెండ్‌ను మారుస్తోంది.

ఫిబ్రవరి 12, గురువారం నాటి బంగారం ధరల(Gold price)ను చూస్తే..దేశవ్యాప్తంగా గోల్డ్ ధరల్లో ఈ తగ్గుదల కనిపిస్తోంది. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.1,58,400 వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల మీద ఏకంగా రూ.12,000 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.11,000 తగ్గి రూ.1,45,200 కు చేరుకుంది.

ఆభరణాల తయారీలో వాడే 18 క్యారెట్ల గోల్డ్ ధర కూడా 10 గ్రాములకు రూ.9,000 తగ్గి మధ్యతరగతి ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పుంజుకోవడం అలాగే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వంటి పరిణామాలు బంగారం ధరల తగ్గుదలకు కారణం కావొచ్చని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు.

Gold price
Gold price

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్, విజయవాడ ,విశాఖపట్నం నగరాల్లో ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,200 తగ్గి రూ.1,58,400 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,45,210 గా ధర పలుకుతోంది. చెన్నైలో మాత్రం గోల్డ్ ధరలు ఇతర నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,59,280 పలుకుతోంది.

ఢిల్లీ , ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కూడా రూ.1,200 వరకూ తగ్గింది. దీనికి తోడు ఇన్వెస్టర్లు వెండిని విక్రయించి బంగారాన్ని కొనడానికి ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లో పసిడికి గిరాకీ ఏ మాత్రం తగ్గడం లేదు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button