Just Andhra PradeshJust PoliticalLatest News

AP Government:పేదలకు బంపర్ ఆఫర్.. ఫ్రీగానే మీ ఇంటి స్థలం క్రమబద్ధీకరణ ..అందరికీనా?

AP Government:గతంలోనే అవకాశాన్ని కల్పించినా చాలా మంది పేదలు అవగాహన లేకపోవడంతో దీనికోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు.

AP Government

ఏపీ ప్రభుత్వం ( AP Government)పేదల పక్షాన నిలుస్తూ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ఇళ్లు నిర్మించుకుని, ఇప్పటికీ సరైన పట్టా కానీ హక్కు పత్రాలు లేకుండా కానీ ఇబ్బంది పడుతున్నారో.. వారికి గొప్ప అవకాశాన్నిఇచ్చింది. వాటిలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లోని ఇంటి స్థలాలను ఉచితంగానే వారికి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే గతంలోనే అవకాశాన్ని కల్పించినా చాలా మంది పేదలు అవగాహన లేకపోవడంతో దీనికోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఆ గడువు ముగియడంతో, దీనిని గమనించిన కూటమి ప్రభుత్వం( AP Government), తాజాగా జీవో నెం. 115 ద్వారా దరఖాస్తు చేసుకునే గడువును ఈ ఏడాది (2026) డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది.

అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారితో పాటు అదే స్థలంలో పూరిపాకలు లేదా తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసిస్తున్న వారు దీనికి అర్హులు. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన పేద కుటుంబాలందరికీ కూడా ఇది వర్తిస్తుంది.

అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని ప్రాంతాల్లోని స్థలాలను మాత్రం క్రమబద్ధీకరించే అవకాశం ఉండదు. చెరువులు, కుంటలు, కాలువలు ఉన్న ప్రాంతాలతో పాటు చెరువు పోరంబోకు భూములను క్రమబద్దీకరించరు. అలాగే డిఫెన్స్ (రక్షణ శాఖ) కు సంబంధించిన భూములతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు అత్యవసరమైన భూములు కూడా క్రమబద్దీకరించరు.

AP Government
AP Government

దీనికోసం అర్హులైన వారు వెంటనే ఆ గ్రామానికి సంబంధించిన సచివాలయంలోలో కానీ, రెవెన్యూ కార్యాలయంలో కానీ సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఇది పూర్తి ఉచిత ప్రక్రియ కాబట్టి, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు..

సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనుకునే పేదకుటుంబాలకు ఇది నిజంగా బంగారు అవకాశం. అయితే డిసెంబర్ 31 వరకు సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకండి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలంటే వెంటనే దరఖాస్తు చేసుకుని మీ స్థలానికి చట్టబద్ధమైన హక్కును పొందండి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button